Homeబిజినెస్Upcoming cars in may india 2026: మే నెలలో కార్ల పండుగ.. ఎన్ని రాబోతున్నాయో...

Upcoming cars in may india 2026: మే నెలలో కార్ల పండుగ.. ఎన్ని రాబోతున్నాయో తెలుసా..

Upcoming cars in may india 2026: మే నెల రాగానే చాలామందికి భయం వేస్తుంది. ఎందుకంటే ఈ నెలలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ కార్లు కొనేవారికి మాత్రం ఈసారి ఈనెల జాతర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2026 మే నెలలో కొన్ని కొత్త కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటిలో కొన్ని ఫేస్ లిఫ్ట్ కార్లు ఉండగా మరికొన్ని విద్యుత్ వేరియంట్ కు చెందినవి ఉన్నాయి. అయితే ఒక్కో కారు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంది. అలాంటి వాటిలో ఐదు కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో అత్యధిక కార్లు సేల్స్ చేసే కంపెనీలో Maruti Suzuki ఒకటి. ఇప్పటికే ఎన్నో రకాల కార్లను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ కంపెనీ ఈ నెలలో Brezza ఫేస్ లిఫ్ట్ నో తీసుకురాబోతోంది. ఇప్పటికే brezza గురించి చాలామందికి తెలుసు. అయితే ఈ కారు ఇప్పుడు ఫేస్ లిఫ్టు ద్వారా రాని ఉండడంతో కొత్తగా కారు కొనాలని అనుకునే వారికి ప్లస్ పాయింట్ గా మారింది. రాబోయే ఈ కారులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 100 బిహెచ్పి పవర్ తో పాటు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ కారు ధర రూ. 90 నుంచి రూ.10 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది.

ప్రముఖ కార్ల కంపెనీ Volkswagen నుంచి కొత్త కారు రాబోతుంది. Virtus ఫేస్ లిఫ్ట్ గా రాబోతున్న ఈ కారు స్టైలిష్ గా ఉండబోతుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఇందులో అడాస్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనిని 10.50 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయించనున్నారు.

ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబం ఉన్నవారు పెద్ద కారు కొనాలని చూస్తున్నారు. ఇలాంటి వారికి Tata company Safari కారును విద్యుత్ వేరియంటు లో తీసుకురాబోతోంది. ఇందులో సెవెన్ సీట్లు ఉండనున్నాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే 550 కిలోమీటర్ల దూరం వెళ్లే ఈ కారులో అడాస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీనిని రూ. 22.5 లక్షల ప్రారంభ ధరతో విక్రయించరున్నారు.

ఇదే కంపెనీకి చెందిన Sierra కారు కూడా ఎలక్ట్రిక్ వేరియంట్ లో రాబోతుంది. ఇందులో మూడు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉండనున్నాయి. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 550 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వనుంది. దీనిని రూ. 20 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయించనున్నారు.

అలాగే స్కోడా కంపెనీకి చెందిన స్లావియా పేస్లిప్ట్ కూడా అందుబాటులో ఉండనుంది. ఈ కారు ధర రూ. 11 లక్షల నుంచి విక్రయించనున్నారు. ఈ కార్లన్నీ మే నెలలోపే అందుబాటులోకి రానున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular