Maruti swept Dzire : కొత్తగా కారు కొనాలనుకునేవారి అభిరుచులు భిన్నంగా ఉంటున్నాయి. వారికి అనుగుణంగా ఉండే విధంగా కార్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఫీచర్స్ తో పాటు మైలేజ్ ఇతర సౌకర్యాలు ఉండే కార్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. వినియోగదారులు అవసరాలను పసిగట్టిన కొన్ని కంపెనీలు వారికి అనుగుణంగా కొత్తకొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కొన్ని కంపెనీలు కొత్త టెక్నాలజీని ఉపయోగించి కొత్త కార్లను తీసుకొస్తుండగా..మరికొన్ని కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడ్లలను మాడిఫికేషన్ చేసి నూతనంగా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. లేటేస్టుగా మారుతి నుంచి డిజైర్ కొత్త తరహా లో రాబోతుంది. ఇప్పటిక స్విప్డ్ డిజైర్ ను చాలా మంది ఆదరించారు. ఇప్పుడు దీని న్యూ మోడల్ పై అందరికీ ఆసక్తి నెలకొంది. కొత్త డిజైర్ ఎలా ఉందంటే?
మారుతి నుంచి విడుదలయిన డిజైర్ విశాలమైన కారు. ఇది ఎస్ యూవీని పోలీ ఉంటుంది. ఇప్పుడు కొత్త గా వస్తున్న కారులో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇందులో 82 బీహెచ్ పీ పవర్ తో పాటు 112 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేసే ఈ మోడల్ పెట్రోల్ వేరియంట్ లో 24.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ద్వారా 25.75 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ కారులో సీఎన్ జీ వేరియంట్ లేదు. కానీ త్వరలో ఈ ఫీచర్ ను కూడా అమర్చే అవకాశం ఉందని అంటున్నారు.
కొత్త స్విప్ట్ డిజైర్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఇంటీరియర్ లో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫైటైన్మెంట్ సిస్టమ్ తో పాటు వైర్ లెస్ చార్జర్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిట, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థలు ఉన్నాయి. అలాగే సేప్టీ ఫీచర్స్ కోసం రియర్ పార్కింగ్, రివర్స్ కెమెరా, సెన్సార్ తో పనిచేసే పార్కింగ్ వంటివి ఆకర్షిస్తాయి. ఎక్సీటీరియల్ లో ఎల్ ఈడీ హెడ్ లైట్లు, ఎల్ ఈడీ టెయిల్ లైట్ లు ఆకర్షిస్తాయి. ఇందులో కొత్తగా సన్ రూఫ్ కూడా అమర్చే అవకాశం ఉంది. ప్రస్తుం మార్కెట్లో ఉన్న హోండా అమేజ్, ఆరా వంటి కార్లకు కొత్త స్విప్ట్ డిజైర్ గట్టి పోటీ ఇవ్వనుంది.
కొత్త డిజైర్ లో అదనపు ఫీచర్లు మరింతగా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇందలుో హలోజన్ టర్న్ ఇండికేటర్స్ కొత్తగా ఉంటాయి. ఫీచర్లు స్టైలింగ్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటాయి. హెడ్ ల్యాంప్ లో ఎల్ ఈడీ రిఫ్లెక్టర్ బారెల్, ఎల్ ఈడీ డీఆర్ఎల్ ఉన్నాయి. ఇక ఇందులో సేప్టే కోసం కొత్తగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి బెస్ట్ కారుగా నిలిచింది. ఇక కొత్త డిజైర్ ను ఇప్పటికే పలుసార్ల టెస్ట్ చేశారు. పూణెలోని ఆరాయి పరీక్ష ద్వారా నెంబర్ వన్ సెడాన్ కారుగా నిలిచింది. ఈ కారును రూ.6.57 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది.