https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున హీరోగా 100 వ సినిమా వచ్చేది ఎప్పుడు..? డైరెక్టర్ ఎవరు..?

సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలా మంది నటులు వల్లకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇక్కడ కొంతమంది భారీ సక్సెస్ లను కూడా అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇక మరి కొంత మంది మాత్రం ఆశించిన సక్సెస్ లు రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేయిడ్ ఔట్ అవుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 4, 2024 / 10:17 AM IST

    Nagarjuna(5)

    Follow us on

    Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీ అక్కినేని నాగార్జున కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగేశ్వరరావు గారి నుంచి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదగాడు. ఇక ఇండస్ట్రీ లో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో వైవిధ్యమైన పాత్రలను చేయగలడు అంటూ తనకంటూ ఒక బ్రాండ్ నేమ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన లాంటి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ వాళ్లందరికీ పోటీని ఇస్తూ టాప్ ఫోర్ హీరోల్లో ఒకటిగా ఎదిగాడు… ప్రస్తుతం ఆయన వేరే వాళ్ళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించడానికి సిద్ధమయ్యాడు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న ‘కుబేర’ సినిమాలో ఇక కీలక పాత్రలో నటించడానికి సిద్ధమయ్యాడు. ఇక దాంతోపాటుగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘కూలీ’ సినిమాలో కూడా విలన్ పాత్రను పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే రీసెంట్ గా ఈయనకు సంబంధించిన పోస్టర్ ను కూడా సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఇక అందులో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న నాగార్జున స్టైలిష్ విలన్ పాత్రను పోషిస్తున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే తన వందో సినిమా కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే దర్శకుడిని ఎంచుకునే పనిలో ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఆయనప్పటికది ఇంకా సెట్ అవ్వలేదు.

    అందుకే ఈ గ్యాప్ లో ఈ సినిమాలను చేసేస్తున్నాడు ఇక ప్రసన్నకుమార్ బెజవాడతో నాగార్జున ఒక సినిమా చేయాల్సింది. కానీ ఆ సినిమా మీద అంత కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో దాన్ని పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. మరి తన వందో సినిమాకి స్టార్ డైరెక్టర్లు చేసే అవకాశం అయితే లేదు.

    ఎందుకంటే అందరూ చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి నాగార్జున మీడియం డైరెక్టర్తోనే తన కాందో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ దర్శకుడు ఎవరు అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇక ప్రస్తుతం నాగార్జునకి తమిళ్ సినిమా డైరెక్టర్లు కూడా కొన్ని కథలను వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ప్రస్తుతం నాగార్జున కుబేర, కూలీ సినిమాలతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతున్నాడు. కాబట్టి అక్కడ కూడా ఆయన భారీగా మార్కెట్ అయితే ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు నాగార్జున తన వందో సినిమాతో తనని తన ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తాడు..ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…