https://oktelugu.com/

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం లో ఈ ఒక్క తప్పు చేయకపోతే సినిమా ఇంకా బాగుండేది…. మరి అలా ఎందుకు చేెశారు..?

నాని లాంటి స్టార్ హీరో ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులందరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు...అలాంటి నాని ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయం లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 4, 2024 / 10:10 AM IST

    Saripodhaa Sanivaaram(2)

    Follow us on

    Saripodhaa Sanivaaram: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సరిపోదా శనివారం సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకునే దిశగా ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని నాని ప్రయత్నం చేస్తున్నాడు. మరి దానికి అనుకూలంగానే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకెళ్తే పర్లేదు కానీ ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్లను వసూలు చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే వివేక్ ఆత్రేయ ఈ సినిమా మొత్తాన్ని చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లినప్పటికీ ఒక విషయంలో మాత్రం చాలా వరకు తప్పు చేశాడు. అది ఏంటి అంటే నాని కంటే ఎస్ జే సూర్య క్యారెక్టర్ అనేది చాలా వైల్డ్ గా ఉండడంతో నాని క్యారెక్టర్ ని సూర్య చాలా ఈజీగా డామినేట్ చేశాడు. కాబట్టి ఇక్కడ హీరో వాల్యూ అనేది చాలా వరకు తగ్గిపోతుంది.

    దానివల్ల ఆటోమేటిగ్గా ఆ క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల నాని కంటే సూర్య వేసిన విలన్ పాత్ర హైలైట్ అయింది. కాబట్టి నాని అభిమానులు కొంతవరకు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక దానివల్లే బ్లాక్ బస్టర్ గా నిలవాల్సిన ఈ సినిమా కేవలం హిట్ దగ్గరే ఆగిపోయింది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    నిజానికి నాని లాంటి ఒక స్టార్ హీరో సినిమాలో ఉన్నాడు అంటే అతని క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడానికి దర్శకుడు చాలా వరకు ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ రివర్స్ లో జరిగింది. అందువల్లే ఈ సినిమా సక్సెస్ ని సాధించినప్పటికీ బ్లాక్ బస్టర్ గా మాత్రం నిలవలేకపోయింది అంటూ నాని అభిమానులు కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి క్రమంలో నాని క్యారెక్టర్ ను ఇంతకు ముందు స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది అనేది ఇప్పుడు అందరి వాదన… ఈ సినిమా కనక లాంగ్ రన్ లో సూపర్ సక్సెస్ అయితే ఇకమీదట నాని క్రేజ్ అనేది తార స్థాయిలోకి వెళ్తుంది.

    ఇక ఈ సినిమాతో వరుసగా మూడు సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మార్కెట్ ని కూడా భారీగా పెంచుకుంటూ పోతున్నాడు. చూడాలి మరి రాబోయే సినిమాలతో నాని ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…