Homeబిజినెస్Vivo FE upcoming phone: Vivo రాబోయే ఫోన్ ధర బడ్జెట్ లోనే.. కెమెరా, బ్యాటరీ...

Vivo FE upcoming phone: Vivo రాబోయే ఫోన్ ధర బడ్జెట్ లోనే.. కెమెరా, బ్యాటరీ గురించి తెలిస్తే క్యూ కడతారు..

Vivo FE upcoming phone: ప్రముఖ మొబైల్ కంపెనీ Vivo కొత్త ఫోన్లతో సందడి చేస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు అప్డేట్ టెక్నాలజీతో మొబైల్స్ ను తయారు చేస్తుంది. ఇందులో భాగంగా Vivo FE మొబైల్ కు సంబంధించి లీకులు వస్తున్నాయి. దీనిని ఇప్పటికే ఇండోనేషియాలో రిలీజ్ చేశారు. త్వరలో భారత్లో అడుగుపెట్టి అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో ఈ మొబైల్ ధర, స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పటికే అంచనా వేస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ ప్రీమియం ఫోన్లు కొనాలని అనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది అని అంటున్నారు. ఇంతకీ ఇందులో ఎలాంటి విశేషాలు ఉన్నాయో చూద్దాం..

Vivo కంపెనీకి చెందిన FE మొబైల్ నేటి తరం వారిని ఆకట్టుకునే విధంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది ఇందులో 6.83 అంగుళాల AMOLED డిస్ప్లే చూడవచ్చు. ఈ డిస్ప్లే 1.5 రిజల్యూషన్ తో ఉండనుంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. IP 68,IP 69 రేటింగ్ ఇన్ డిస్ప్లేలో చూడొచ్చు. ఈ కొత్త మొబైల్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 7360 టర్బో చీప్ సెట్ అమర్చారు. అలాగే ఇందులో 12 GB రామ్, 512 GB స్టోరేజ్ ఉండడంతో రోజువారి వినియోగదారులతోపాటు గేమింగ్ కోరుకునే వారికి కూడా ఈ ప్రాసెసర్ బాగా పనిచేస్తుంది. దీంతో ఎలాంటి వేగం తగ్గకుండా ఉంటుంది.

ఈ మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వివో ఎలాంటి మొబైల్స్ లో లేని విధంగా ఇందులో 200 MP మెయిన్ కెమెరా ఉండనుంది. 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో మరో కెమెరాను చూడవచ్చు. సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం 32 MP కెమెరా పనిచేస్తుంది. మెరుగైన ఫోటోగ్రఫీ కావాలని అనుకునే వారితో పాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం పనిచేసే వారికి ఈ ఫోన్ బాగా సరిపోతుంది. ఇందులో బ్యాటరీ వ్యవస్థ బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. 7000 mAh బ్యాటరీ ఉండగా దీనికి 90 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం యూత్ చేసేవారికి ఈ బ్యాటరీ పనితీరు సపోర్ట్ చేయనుంది.

ఇండోనేషియాలో రిలీజ్ అయిన ఈ మొబైల్ 8GB రామ్ కలిగిన ఫోన్ IDR 6,499,000 ధరతో విక్రయిస్తున్నారు. భారతదేశంలో రిలీజ్ అయితే దీనిని రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న రియల్ మీ 16 ప్రో, నథింగ్ ఫోన్ 4a సిరీస్ మొబైల్స్ లకు కొత్తగా మార్కెట్లోకి వచ్చే వివో FE ఫోన్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version