Maruthi Suzuki Alto K 10: Maruti Suzuki కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటూ వస్తుంది. ఈ కంపెనీ నుంచి ఎటువంటి కారు విడుదల అయినా.. వెంటనే దాని గురించి తెలుసుకోవాలని చూస్తారు. అయితే మారుతి సుజుకి గతంలో విడుదల చేసిన కార్ల డిమాండ్ ఇప్పటికీ తగ్గడం లేదు. అంతేకాకుండా అవి నేటి తరం వారికి ఉపయోగపడేలా అప్డేట్ అవుతూ మార్కెట్లోకి వస్తున్నాయి. అందులో ఆల్టో K10 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే ఈ కారు దశాబ్దాల కిందట రోడ్లపైకి వచ్చి ఎందరును ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ తరానికి ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకొని మార్కెట్లోకి రాబోతోంది. అయితే దీని మైలేజ్, డిజైన్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం..
Maruti Suzuki Alto K 10 కారును కేవలం కారుగానే కాకుండా ఇదొక సాంప్రదాయ వాహనంగా భావించారు. సొంత అవసరాలకు.. చిన్న ఫ్యామిలీకి ఎంతో ఉపయోగపడిన ఈ కారు ఇప్పుడు లగ్జరీ కార్లకు పోటీ ఇచ్చే విధంగా మారిపోయింది. ప్రధానంగా దీని బాహ్య డిజన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఈ కారు ముందు సూక్ష్మమైన క్రోమ్, క్లీన్ గ్రిల్ డిజైన్ ను కలిగి ఉంది. గతంలో ఉన్న కారుకు హెడ్ లాంప్స్ చిన్నగా ఉండేవి. ఇప్పుడు దానిని పెద్దగా చేర్చారు. దీంతో రాత్రి సమయంలో కూడా దూర ప్రయాణాలు చేసేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి.
ఈ కొత్త కారు ఇన్నర్ పూర్తిగా మారిపోయింది. విశాలమైన స్పేస్ తో కలిగి ఉన్న ఇందులో డాష్ బోర్డు లేఅవుట్ ఆకట్టుకుంటుంది. డ్రైవర్ కు సులభంగా ఉండే విధంగా డ్యూయల్ టోన్, ఇంటీరియర్ థీమ్ ఆకట్టుకుంటుంది. ఇది కాంపాక్ట్ కారు అయినప్పటికీ లోపల SUV స్పేస్ ను కలిగి ఉండడంతో చిన్న కుటుంబం, పిల్లలతో ప్రయాణం చేసే వారికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇందులో డోర్ ప్యాకెట్స్, కప్ హోల్డర్లు యుటిలిటీ కారు వలే తలపిస్తాయి. లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తో పాటు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ మద్దతు ఇచ్చే విధంగా ఫీచర్స్ ను సెట్ చేశారు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ డిస్ప్లే, ఫ్రంట్ పవర్ విండోస్, కి లెస్ ఎంట్రీ వంటి అదనపు ఫీచర్లు సౌకర్యాన్ని కలిగిస్తాయి.
కొత్తగా వచ్చే మారుతి ఆల్టో k10 కార్ లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది సిటీలో ఎక్కువగా ప్రయాణం చేసే వారికి అనుగుణంగా ఉంటుంది. పరిమిత వేగంతో సులభంగా గమ్యానికి చేరే విధంగా సహకరిస్తుంది. స్టీరింగ్ తేలికగా ఉండడంతో కొత్తగా కారు నడిపిన వారికి సైతం అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ కారు లీటర్ ఇంధనానికి 23 కిలోమీటర్ల మైలేజ్ జీవన్ ఉంది. అయితే స్థిరమైన వేగాన్ని కొనసాగిస్తే 25 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇందులో మాన్యువల్ తో పాటు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ను అమర్చారు. ఇది మార్కెట్లోకి వస్తే రూ.3.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది.