Jana Nayagan And Rajasaab Overseas Advance Bookings: ఈ సంక్రాంతికి సౌత్ ఇండియా నుండి ముగ్గురు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. తమిళనాడు నుండి తలపతి విజయ్(Thalapathy Vijay) హీరో గా నటించిన ‘జన నాయగన్'(Jana Nayagan), టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu), రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రాలు విడుదల అవుతున్నాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే విడుదల అవుతుంది కాబట్టి, ఆ సినిమా గురించి కాసేపు పక్కన పెడుదాం, అన్ని భాషల్లోనూ విడుదల అవుతున్న మిగిలిన రెండు సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై చాలా రోజులే అయ్యింది. ప్రభాస్ ని సందీప్ వంగ ‘ఇండియా’స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ‘ గా పరిచయం చేసాడు కాబట్టి, ప్రభాస్ గతం లో రెండు వెయ్యి కోట్ల సినిమాలు, ఒక 600 కోట్ల గ్రాసర్ సినిమా ఉంది కాబట్టి, కచ్చితంగా ‘రాజా సాబ్’ చిత్రం ‘జన నాయగన్’పై లీడింగ్ తీసుకుంటుందని అంతా అనుకున్నారు.
కానీ విజయ్ క్రేజ్ ముందు ‘రాజా సాబ్’ చిత్రం చిత్తుచిత్తు అయిపోయింది. ఓవర్సీస్ మార్కెట్ లో ‘రాజా సాబ్’ చిత్రం ‘జన నాయగన్’ కి దరిదాపుల్లో కూడా లేదు. పైగా ‘జన నాయగన్’ చిత్రం గొప్ప ఈవెంట్ సినిమా ఏమి కాదు, మన తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘భగవంత్ కేసరి’ కి రీమేక్. రీమేక్ సినిమాలను జనాలు చూడడం పూర్తిగా మానేసిన రోజులివి, అయినప్పటికీ ఈ ‘జన నాయగన్’ చిత్రం ఓవర్సీస్ లో సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఉదాహరణకు నార్త్ అమెరికా ని తీసుకుందాం. నార్త్ అమెరికా మన టాలీవుడ్ సినిమాలకు కంచుకోట లాంటిది. ఇక్కడ తమిళ సినిమాలు పెద్దగా ఆడవు, కాబట్టి కచ్చితంగా ‘రాజా సాబ్’ చిత్రం భారీ లీడింగ్ చూపిస్తాదని అందరూ ఆశించారు.
కానీ అది జరగలేదు. ‘జన నాయగన్’ చిత్రానికి USA లో కేవలం 500 మాత్రమే కేటాయించారు. మరోపక్క ‘రాజా సాబ్’ కి 1200 షోస్ కేటాయించారు. కానీ ‘జన నాయగన్’ చిత్రానికి నార్త్ అమెరికా మొత్తం కలిపి 800K డాలర్స్ రాగా, ‘రాజా సాబ్’ కి కేవలం 600K డాలర్స్ మాత్రమే వచ్చాయి. యునైటెడ్ కింగ్డమ్ లో ‘జన నాయగన్’ చిత్రానికి 50 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతే, ‘రాజా సాబ్’ కి కేవలం 20 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. ఇక మలేషియా లో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టిన 24 గంటల్లో లక్షా 10 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ రేంజ్ డామినేషన్ తో ‘జన నాయగన్’ కొనసాగుతుందని బహుశా విజయ్ ఫ్యాన్స్ కూడా ఊహించి ఉండరు. ఇక ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక, ఏ చిత్రం ఎక్కువ డామినేట్ చేయబోతుందో చూడాలి.