Meenakshi Chaudhary: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). కెరీర్ లో హిట్ శాతం తక్కువే. అయినప్పటికీ కూడా ఈమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. కారణం ఆమెకు యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్. 2023 చివర్లో లక్కీ భాస్కర్ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న మీనాక్షి చౌదరి, 2024 లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో మరో భారీ కమర్షియల్ హిట్ ని అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె నాగ చైతన్య తో ‘వృష కర్మ’ అనే సినిమా, అదే విధంగా నవీన్ పోలిశెట్టి తో ‘అనగనగా ఒక రాజు’ వంటి సినిమాలు చేసింది. వీటిల్లో ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి పలు టీవీ షో ఈవెంట్స్ కి హాజరు అవ్వడం, అతనితో కలిసి ఇంటర్వ్యూస్ ఇవ్వడమే కాకుండా, సొంతంగా కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంది. అలా రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. గత కొంతకాలంగా మీనాక్షి చౌదరి ప్రముఖ హీరో సుశాంత్ తో పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, ప్రస్తుతం వీళ్లిద్దరు ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ చేస్తున్నారని ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈ అంశం గురించి యాంకర్ మీనాక్షి చౌదరి ముందు ప్రస్తావిస్తూ, ఆమెని వివరణ కోరగా ‘నేను, సుశాంత్ మంచి స్నేహితులం. నా సినీ కెరీర్ సుశాంత్ తోనే మొదలైంది. అప్పటి నుండి మేమిద్దరం క్లోజ్ గానే ఉంటున్నాం’.
‘కానీ సోషల్ మీడియా లో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అనే వార్తని చూసి మేము నవ్వుకున్నాము. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఇలాంటి రూమర్స్ వస్తాయని ముందుగా ఊహించాను. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రూమర్ లో ఎలాంటి వాస్తవం లేదు. పెళ్లి గురించి ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదు. కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటాను. నేనే బహిరంగంగా సమయం వచ్చినప్పుడు చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ మొదట్లో ఇలాగే చెప్తారు, కానీ చివరికి వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. ఎన్ని చూడలేదు ఇలాంటివి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.