Maruti car : దేశంలో మారుతి సుజుకి కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా కారు కొనాలని అనుకునేవారు.. మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా మారుతి కార్లు వైఫై ఆసక్తిగా చూస్తారు. అయితే మారుతి కారు కొనాలని అనుకునే వారికి తాజాగా కంపెనీ షాక్ ఇచ్చింది. కొన్ని కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. 2025 సంవత్సరం ఏర్పడిన తర్వాత ఇప్పటికే మారుతి కంపెనీ రెండుసార్లు ధరలు పెంచింది.. ఇప్పుడు మూడోసారి పెంచాలని చూస్తుంది. ఇవి ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. అయితే గరిష్టంగా పెంపు ఎంత ఉంటుంది? ఏ కారుపై ఎంత పెంచుతున్నారు? అనే వివరాల్లోకి వెళ్దాం
Also Read : అమ్మకాల్లో టాటా, హ్యుందాయ్ లను వెనక్కి నెట్టిన మరో మారుతి కారు..
కంపెనీ నిర్వహణ తోపాటు ఇతర కారణాల వల్ల కార్ల ధరలు మరోసారి పెంచాల్సి వస్తుందని మారుతి యాజమాన్యం తెలుపుతోంది. ఒక్కో కారుపై కనిష్టంగా రూ. 2,500 నుంచి గరిష్టంగా రూ. 62 వేల వరకు పెంచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇందులో సెడాన్ కార్లతో పాటు SUV లు కూడా ఉన్నాయి. అలాగే కంపాక్ట్ SUV కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని కంపెనీ ప్రకటించింది.
వీటిలో మారుతి సుజుకి కి చెందిన SUV ఫ్రాంక్స్ ధర రూ.2,500 ను పెంచింది. అలాగే గ్రాండ్ విటారా ధర రూ. 62,000 అత్యధికంగా పెంచింది. అలాగే అందరూ ఎక్కువగా ఇష్టపడే మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ కారు ధరలో రూ.3, 000 లకు పెంచింది. కాంపాక్ట్ SUV వ్యాగన్ ఆర్ కారుపై రూ.14,000 లకు పెంచింది. అలాగే ఎకో వ్యాన్ ధరను రూ.22,500 అత్యధికంగా విక్రయించాలని చూస్తోంది.
2025 ఫిబ్రవరి 1న మారుతి ఆల్టో కే 10 తోపాటు వివిధ మూడళ్లపై రూ.32,500 వరకు పెంచింది. అయితే ఇప్పుడు మరోసారి కాళ్లు ధరలు పెరగడంతో కొనుగోలు చేసేవారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మారుతి అమ్మకాలు నెంబర్వన్ స్థాయిలో ఉన్నాయి. వీటిలో 2025 మార్చిలో 1,92,984 యూనిట్లు విక్రయించింది. అలాగే ఈ కంపెనీకి చెందిన 7 సీటర్ ఈకో కూడా అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకుంది. అయితే ఇలాంటి సమయంలో కార్ల ధరలు పెరగడం వల్ల ప్రభావం ఉంటుందా? అనే చర్చ జరుగుతుంది. కానీ కంపెనీ మాత్రం కాల ధరలు పెంచడం తప్పడం లేదని పేర్కొంటుంది. పెరిగిన కాల ధరలు ఏప్రిల్ 8 నుంచి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
అయితే మిగతా కంపెనీలు మాత్రం ధరల పెరుగుదలపై ప్రకటించలేదు. మిగతా కార్ల ధరలు పెరిగితే కొనుగోలుదారులకు ఇది నిరాశ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కార్ల కొనుగోలుపై చాలామందికి ఆసక్తి పెరిగింది. నేనే పద్యంలో ధరలతో ఆందోళన చెందే అవకాశం ఉంది. అయితే ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు వాటి వైపు వెళ్లే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ నిపుణులు తెలుపుతున్నారు. అయితే కార్ల ధరలు పెరిగిన తర్వాత సేల్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి..
Also Read : మారుతి గ్రాండ్ విటారా ఈవీ.. ఎంత వరకు భద్రం? క్రాస్ టెస్టింగ్ లో ఏం తేలింది?