Homeఆంధ్రప్రదేశ్‌Kolikapudi Srinivasa Rao: కొలికపూడిని కెళుకుతారా? వదిలేస్తారా?

Kolikapudi Srinivasa Rao: కొలికపూడిని కెళుకుతారా? వదిలేస్తారా?

kolikapudi srinivasa rao: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు( Kohli ka pudi Srinivasa Rao ) విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పదేపదే వివాదాలు సృష్టించడం.. నాయకత్వం పిలిచి మాట్లాడడం పరిపాటిగా మారింది. ఇంతవరకు ఆయన పై ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఆయన సైతం అదే ధీమాతో ఉన్నారు. అయితే కొలికపూడి మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. తాజాగా ఓ ఆలయ కార్యక్రమంలో హుందాగా వ్యవహరించాల్సింది […]

kolikapudi srinivasa rao: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు( Kohli ka pudi Srinivasa Rao ) విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పదేపదే వివాదాలు సృష్టించడం.. నాయకత్వం పిలిచి మాట్లాడడం పరిపాటిగా మారింది. ఇంతవరకు ఆయన పై ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఆయన సైతం అదే ధీమాతో ఉన్నారు. అయితే కొలికపూడి మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. తాజాగా ఓ ఆలయ కార్యక్రమంలో హుందాగా వ్యవహరించాల్సింది పోయి.. దూకుడుగా ముందుకు సాగడంతో వివాదం మరింత ముదిరింది. అయితే దీనిపై టిడిపి నాయకత్వం ఆగ్రహంగా ఉంది. నేరుగా చర్యలకు దిగడం కంటే.. కొలికపూడిని పట్టించుకోకపోవడం మేలు అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..

* మారని పద్ధతి..
ఇప్పటివరకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిని టిడిపి హై కమాండ్ పలుమార్లు పిలిచింది. వివరణలు కూడా తీసుకుంది. పద్ధతి మార్చుకోవాలని సూచించింది. కానీ ఆయన వైఖరి మారడం లేదు. పైగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పిలిచి మాట్లాడితే పద్ధతి మార్చుకుంటానని చెబుతున్నారు. బయటకు వెళ్లి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యేతో తెలుగుదేశం నాయకత్వం విసిగిపోయింది. అందుకే కొద్ది రోజులు ఆయన విషయంలో పట్టించుకోకపోవడం మేలన్న నిర్ణయానికి వచ్చింది.

* ఆగ్రహంగా టిడిపి శ్రేణులు..
కొలికపూడి విషయంలో టిడిపి శ్రేణులు సైతం ఆగ్రహంగా ఉన్నాయి. ఆయన ఉద్దేశపూర్వకంగానే అలా ప్రవర్తిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయనపై చర్యలు తీసుకుంటే మాత్రం ఆయన కచ్చితంగా రెబల్ అవుతారు. ఇప్పటివరకు ఆయన జిల్లా నాయకత్వంతో పాటు ఎంపీని వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే మాత్రం నేరుగా టిడిపి నాయకత్వాన్ని టార్గెట్ చేస్తారు. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్లోకి తప్పకుండా వెళ్తారు. అది అంతిమంగా టిడిపి నాయకత్వానికి ఇబ్బంది కరం. అలాగని ఇలానే విడిచి పెడితే మరింత వివాదాలు ముదిరే అవకాశం ఉంది. ఇప్పటికే కొలికపూడి విషయంలో అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఆయన మాట పెద్దగా చెల్లుబాటు కావడం లేదు. అయితే తాజాగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఈ ఎపిసోడ్ పైనే మాట్లాడారు. ఆయనకు చెప్పాల్సింది చెప్పాము అని.. ఇక పిలిచి మాట్లాడే ఉద్దేశం లేదని చెప్పడం ద్వారా కఠిన చర్యలు తప్పవని సంకేతాలు పంపారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper