Nithyananda: నిత్యాంనంద పదేళ్ల క్రితం ఇతనో సంచలనం.. స్వామీజీగా చెలామణి అవుతూ ఎవరికీ తెలియకుండా రాసలీలలు సాగించారు. బండారం బయటపడడం.. అరెస్టు వారెంటు జారీ కావడంతో దేశం విడిచి పారిపోయాడు. ఐలాండ్ కొనుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.
Also Read: కంచ గచ్చిబౌలి భూముల ఫోటో.. ఫోటోగ్రాఫర్ కు కాంగ్రెస్ నేత బంపర్ ఆఫర్!
వేధింపులు వంటి కేసుల్లో చిక్కుకుని భారత్ నుంచి పరారైన నిత్యానంద స్వామి అజ్ఞాతంలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, దక్షిణ అమెరికా(South America) దేశం బొలీవియాపై ఆయన దృష్టి పడినట్లు సమాచారం. నిత్యానంద సన్నిహితులు అక్కడ భూ ఆక్రమణకు ప్రయత్నించి, స్థానిక తెగలతో భూమి లీజు ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారం బహిర్గతమవడంతో బొలీవియా అధికారులు ’కైలాస’(Kailasa)తో సంబంధం ఉన్న 20 మందిని అరెస్టు చేసి, వారి స్వదేశాలకు పంపించారు. కైలాస ప్రతినిధులు ఇటీవల బొలీవియా(Bolivia)లో పర్యటించారు. ఈ సందర్భంలో కార్చిచ్చును ఎదుర్కొనేందుకు స్థానికులకు సాయం చేసిన వీరు, అక్కడి భూమిపై కన్నేశారు. స్థానిక తెగలతో లీజు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్‌తో కూడా కైలాస ప్రతినిధులు ఫొటోలు దిగారు. ఒక దశలో 2 లక్షల డాలర్లకు దిల్లీకి మూడింతల విస్తీర్ణంలోని ప్రాంతాన్ని 25 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడానికి స్థానిక తెగలు అంగీకరించాయి.
వెయ్యేళ్ల లీజు..
అయితే, కైలాస ప్రతినిధులు వెయ్యి సంవత్సరాల(Thousand Years)లీజుతో పాటు గగనతల వినియోగం, సహజ వనరుల తవ్వకం వంటి షరతులను ప్రతిపాదించారు.
ఈ విషయంపై బొలీవియా వార్తాపత్రిక ఓ పరిశోధనాత్మక కథనం ప్రచురించడంతో స్థానికంగా సంచలనం రేగింది. అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. కైలాసతో సంబంధం ఉన్న 20 మందిని అరెస్టు చేసి, వారితో స్థానికులు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసింది. అరెస్టయిన వారిని భారత్(India), చైనా(China), అమెరికా(America) వంటి దేశాలకు తరలించారు. ఇమిగ్రేషన్ అధికారుల ప్రకారం, ఈ వ్యక్తులు పర్యాటకులుగా బొలీవియాలోకి పలుమార్లు ప్రవేశించి, స్థానికులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గత నవంబర్ నుంచి కొందరు అక్కడే స్థిరపడినట్లు గుర్తించారు.
ఎలాంటి సంబంధాలు లేవు..
ఇదిలా ఉంటే.. బొలీవియా విదేశాంగ మంత్రి ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ, వివాదాస్పద ’యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’తో ఎలాంటి దౌత్య సంబంధాలు లేవని స్పష్టం చేశారు. నిత్యానంద దేశం నుంచి పారిపోయి ’కైలాస’ అనే ప్రాంతంలో ఆశ్రమం స్థాపించినట్లు వార్తలు వచ్చాయి. ఈ కైలాసం ఎక్కడ ఉందన్న దానిపై ఊహాగానాలు చెలరేగాయి. ఈక్వెడార్(Equadar) సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి, దానికి కైలాస అని నామకరణం చేసినట్లు నిత్యానంద గతంలో ప్రకటించాడు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఓ కేసు సందర్భంగా నిత్యానంద ఈక్వెడార్‌లో ఉన్నట్లు హైకోర్టుకు తెలిపింది.