Maruti Cars: కారు కొనాలని అనుకున్న సమయంలో అన్ని విషయాలను పరిశీలించాలి. ముఖ్యంగా కారు ధరతో పాటు ఇందులో ఉండే ఫీచర్స్ గురించి పక్కాగా తెలుసుకోవాలి. అయితే చాలా మంది కారు Safetyగా ఉందా? లేదా? అనేది తెలుసుకుంటారు. కొన్ని కార్లు ప్రత్యేకంగా రక్సణగా ఉంటుంది. ఇలాంటి కార్లలో ప్రయాణం చేయడం వల్ల ఒకవేళ ప్రమాదానికి గురైనా పెద్దగా నష్టం ఉండదు. అయితే కొన్ని కార్లు మాత్రం ఫీచర్స్ ను ఆకట్టుకుంటూ లో బడ్జెట్ లో అందుబాటులో ఉంటాయి. ఈ కార్లు సేప్టీలో కాస్త తక్కువగానే ఉంటాయి. మారుతి సుజుకీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారును ఇటీవల Cross Testingను నిర్వహించారు. మరి ఈ కారు ఎంత సేప్టీగా ఉందో తెలుసుకోవాలని ఉందా?
ఇటీవల ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. దాదాపు అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వేరియంట్ లో కార్లను తీసుకొచ్చాయి. కానీ మారుతి సుజుకీ మాత్రం చాలా ఆలస్యంగా విద్యుత్ కారును పరిచయం చేసింది. ఇటీవల ఢిల్లీ మొబిలిటీ షో లో Grand Vitara Evని పరిచయం చేసింది. SUV వేరియంట్ లో ఉన్న ఈ కారు వినియోగదారులను ఆకర్షించింది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న గ్రాండ్ విటారా లాగే ఉన్నా..ఇందులో ఇంజిన్ పనితీరు వేరే ఉంటుందని కంపనీ ప్రతినిధులు చెప్పారు.
అయితే ఈ కారు ఎంత సేప్టీగా ఉందో టెస్టింగ్ నిర్వహించారు. కానీ ఈ టెస్టింగ్ ఇన్నర్ లోనే కంపెనీ మాత్రమే నిర్వహించింది. ఈ టెస్టింగ్ లో గ్రాండ్ విటారా ఈవీ మెరుగైన ఫలితాలను అందించినట్లు తెలిపారు. ఈ కారులో సేప్టీ కోసం 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఇందులో 2 అడాస్ ను కలిగి ఉంది. ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను ఇందులో అమర్చారు. వీటితో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇందులో పనిచేతస్ంుది. 360 డిగ్రీ కెమెరా ఈ కారుకు రక్షణ ఇస్తుంది.
అతి త్వరలోనే ఈ కారు వినియోగదారులకు చేరనుంది. మారుతి సుజుకీ నుంచి మార్కెట్లోకి వస్తున్న మొట్టమొదటి కారు అయినందున దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ కారులో 49 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. అలాగే 61 కిలో వాట్ అనే మరో బ్యాటరీని కూడా చేర్చారు. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. ఇందులో ఉండే ఫీచర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. మారుతి గ్రాండ్ విటారా ఇన్నర్ లో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు 10.25 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
సాధారణంగానే మారుతి సుజుకీ కార్లపై చాలా మందికి ఎక్కువగా నమ్మకం ఉంటుంది. ఇలాంటి సమయంలో మొదటి విద్యుత్ కారును కొనుగోలు చేయాలనే ఆశ ఉంటుంది. దీంతో ఈ కారు మార్కెట్లోకి తీసుకొచ్చే ముందు అన్నీ రకాలుగా పరీక్షించనున్నారు. ఇందులో భాగంగా తాజాగా సేప్టీ టెస్ట్ ను చేశారు.