Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమాకు భారీతనం పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన ఇండియాలోనే టాప్ డైరెక్టర్. అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి రికార్డులకు ఎక్కాడు. ఒక్కో సినిమాతో మరో స్థాయికి ఆయన వెళుతున్నారు. బాహుబలి, బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఆస్కార్ కొల్లగొట్టి, భారతీయ సినిమా కీర్తిని ప్రపంచ సినిమా వేదికపై చాటింది. అలాంటి దర్శకుడిని వస్తున్న మూవీ అంటే సాధారణంగా అంచనాలు ఉంటాయి. అందులోనూ మొదటిసారి మహేష్ బాబు వంటి బడా స్టార్ తో రాజమౌళి మూవీ చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో SSMB 29 సెట్స్ పైకి వెళ్ళింది. హైదరాబాద్ లోని నగర శివారులో ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. సెకండ్ షెడ్యూల్ ఒరిస్సాలో జరుగుతుంది. అవుట్ డోర్ షూటింగ్ కావడంతో కీలకమైన ఓ సన్నివేశం లీకైంది. ఇక SSMB 29 బడ్జెట్ రూ. 1000 కోట్లు అని సమాచారం. దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ గా ఇది రికార్డులకు ఎక్కుతుంది. కాగా బాహుబలి తరహాలో SSMB 29 రెండు భాగాలుగా తెరకెక్కనుందని ప్రచారం జరిగింది. రెండు భాగాల కోసం దాదాపు ఐదేళ్లు మహేష్ బాబు రాజమౌళికి కేటాయించాడని వార్తలు వచ్చాయి.
Also Read : రాజమౌళి మహేష్ బాబు సినిమాలో ఆ ఒక్కటి తగ్గుతుందా..?
అయితే SSMB 29కి సీక్వెల్ లేదు అనేది తాజా సమాచారం. మొత్తం కథ ఒక భాగంలోనే చెప్పాలని రాజమౌళి భావిస్తున్నారట. ఆర్ ఆర్ ఆర్ తరహాలో మూవీ నిడివి ఎక్కువ ఉంటుందట. బలమైన కథతో పాటు మైండ్ బ్లాక్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడిన SSMB 29 సుదీర్ఘంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు కుర్చీలకు అతుక్కుపోయి మూవీ ఎంజాయ్ చేస్తారని రాజమౌళి నమ్మకం అట. కాబట్టి SSMB 29కి మరో భాగం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
SSMB 29 విడుదలకు మరో రెండేళ్ల సమయం పడుతుందట. 2027లో ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం కలదు అట. ఇక మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా ఎంచుకున్నారు. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ ఇది విశ్వసనీయ సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతుంది. మహేష్ ప్రపంచాన్ని చుట్టే వీరుడిగా కనిపిస్తాడట. కథలో కాశీ బ్యాక్ డ్రాప్ ఉంటుందనే వాదన కూడా ఉంది.
Also Read : రాజమౌళి మహేష్ బాబు కాంబో వస్తున్న సినిమాలో నటించనున్న హాలీవుడ్ స్టార్ డైరెక్టర్…