Mahindra Vision S: మార్కెట్లో Mahindra కంపెనీకి చెందిన కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. దీని నుంచి మార్కెట్లోకి వచ్చే ఏ వాహనం అయినా దాని గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతారు. మహీంద్రా యాజమాన్యం సైతం వాహనాల క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఉంటారు. అందుకే ధర ఎక్కువైనా ఈ వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే Mahindra కంపెనీకి చెందిన లేటెస్ట్ కారు హాట్ టాపిక్ గా మారింది. దీని గురించిన సమాచారం ఆన్లైన్లో ఉండడంతో దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇది మార్కెట్లోకి రావడానికి సమయం ఉన్నప్పటికీ.. దీని ఫీచర్లు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇంతకీ అవి ఎలా ఉన్నాయంటే?
Mahindra కంపెనీ నుంచి Vision.S అనే SUV కారు మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. దీనిని ఇప్పటికే 2025 ఆగస్టు లో ఫ్రీడమ్ ఎన్ యు ప్లాట్ ఫారం పై ఆవిష్కరించారు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ వేరియంట్ ఉండే అవకాశం ఉంది. రెండు రకాల ఇంజిన్లు ఉండడంతో దీని పనితీరు మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే రోడ్ సేఫ్టీ కోసం ఇందులో 2 ADAS టెక్నాలజీని చేర్చనున్నారు. ఇంజన్ మాత్రమే కాకుండా ఇన్నర్ ఫీచర్స్ విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. డ్యూయల్ స్క్రీన్లు ఉండే అవకాశం ఉంది. వీటిలో ఒకటి నెక్స్ట్ జెన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం డిస్ప్లే ఉండగా.. మరొకటి డ్రైవర్ డిస్ప్లేను అమర్చారు. ఆటోమేటిక్ క్లైమేట్ కోసం డిజిటల్ తో పాటు మాన్యువల్ గా మార్చుకునేందుకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను ఉంచారు. త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, haptic కంట్రోల్ తో డ్రైవర్లకు రక్షణగా ఉండని ఉంది.
ప్రస్తుతం చాలామంది కోరుకునే పనోరమిక్ గ్యాస్ రూఫ్ తో పాటు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ను ఇందులో అమర్చారు. ఎక్స్టీరియర్ విషయానికి వస్తే.. ప్లస్ డోర్ హ్యాండిల్స్, పిక్సెల్ ఎల్ఈడి లైట్స్, రూప్ నిచ్చెన, టేల్ గెట్, మౌంటెడ్ స్పేర్ వీల్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో ఇందులో సౌకర్యవంతంగా ఉండరు ఉంది. అయితే ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ కారు రావడానికి 2027 వరకు ఆగాల్సిందేనని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. కానీ దీని ఫీచర్లను చూసిన తర్వాత చాలామంది ఆగలేక పోతున్నారు. మహీంద్రా కార్లు ధర ఎక్కువగా ఉన్నా కూడా వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే దీని ధర విషయం కంపెనీ తెలపనప్పటికీ రూ.10.50 లక్షలా ప్రారంభ ధరతో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.