https://oktelugu.com/

Mahindra Thar X :  మార్కెట్లోకి ‘థార్ ఎక్స్’.. ఫీచర్స్, ధర సూపరో..సూపర్..

థార్ ఎక్స్ ఫీచర్స్ విషయానికొస్తే ఇది 5 డోర్ల ఎస్ యూవీ. ఇందులో ఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఆకర్షించనున్నాయి. అలాగే ఎల్ ఈడీ టెయిల్ ల్యాంప్స్ కొత్తగా కనిపిస్తాయి. 18 అంగుళాల స్టీల్ వీల్స్ తో పాటు డ్యూయెల్ టోన్ మెటల్ టాప్ ను కలిగిన ఇందులో యూఎస్ బీ చార్జర్ పర్ట్, అడ్డస్టబుల్ సీట్లు, కీ లెస్ ఎంట్రీ వంటి సౌకర్యాలు ఉన్నాయి

Written By:
  • Srinivas
  • , Updated On : August 15, 2024 3:11 pm
    Mahindra Thar X

    Mahindra Thar X

    Follow us on

    Mahindra Thar X : కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అయితే పండుగలు, ప్రత్యేక దినాల్లో వీటిని రిలీజ్ చేయడం వల్ల ప్రజల్లో ఇంప్రెస్ అవుతుంది. అందుకే శ్రావణ మాసం ప్రారంభం అయిన నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఇప్పటికే కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తాజాగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా మహీంద్రా నుంచి కొత్త కారు లాంచ్ అయింది. ఎస్ యూవీ కార్లకు పెట్టింది పేరు మహీంద్ర అండ్ మహీంద్రా. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన థార్ ఇప్పటికే పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిని అప్డేట్ చేసిన ‘థార్ రాక్స్’ గా రిలీజ్ చేశారు. ధర కూడా ఆకట్టుకునే విధంగా నిర్ణయించారు. ఇంతకీ కొత్త థార్ ఎలా ఉందో చూద్దాం..

    థార్ ఎక్స్ ఫీచర్స్ విషయానికొస్తే ఇది 5 డోర్ల ఎస్ యూవీ. ఇందులో ఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఆకర్షించనున్నాయి. అలాగే ఎల్ ఈడీ టెయిల్ ల్యాంప్స్ కొత్తగా కనిపిస్తాయి. 18 అంగుళాల స్టీల్ వీల్స్ తో పాటు డ్యూయెల్ టోన్ మెటల్ టాప్ ను కలిగిన ఇందులో యూఎస్ బీ చార్జర్ పర్ట్, అడ్డస్టబుల్ సీట్లు, కీ లెస్ ఎంట్రీ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దీని డిజైన్ బాక్సీ థార్ సిల్హౌట్ తో కనిపిస్తుంది. ఈ కారు ముందరి భాగంలో సీ ఆకారపు లైట్లు ప్రత్యేకంగా ఉంటాయి. డ్యాష్ బోర్డ్ బ్లాక్ లెదర్ ప్యాడింగ్ తో కవర్ చేయబడింది. డ్రైవర్ తో పాటు మిగతా వారికి సౌకర్యవంతమైన సీట్లు ఇందులో ఉన్నాయి.

    కొత్త థార్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 160 బీహెచ్ పీ పవర్ వద్ద 330 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో డీజిల్ వేరియంట్ కూడా కలిగి ఉంది. ఇది 150 బీహెచ్ పీ పవర్ వద్ద 330 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. అయితే ట్రాన్స్ మిషన్ పై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. థార్ రాక్స్ ను రూ.12 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది. డీజిల్ వేరియంట్ వెహికల్ కు రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.

    ఇప్పటికే రిలీజ్ అయిన థార్ కు ప్రత్యర్థిగా మారుతికి చెందిన జమ్నీగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ జిమ్నీని మించిన ఫీచర్లు, టెక్నాలజీ థార్ ఎక్స్ లో ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా దీనిని మార్కెట్లో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. దీంతో మహీంద్రా నుంచి ఇప్పటికే ఉన్న థార్ వలె.. థార్ ఎక్స్ కూడా మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నారు. మరి ఈ కొత్త థార్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే కొత్తగా ఎస్ యూవీ కొనాలనుకునే వారికి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అంతేకాకుండా 5 సీటర్ ఉన్నందువల్ల లాంగ్ ట్రిప్ కు ఇది అనుగుణంగా ఉండే అవకాశం ఉంది.