Tamannaah Batia : సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం కొందరు తపస్సులు చేస్తుంటారు. ఒక్క అవకాశం వస్తే చాలు.. తమ జీవితం మారిపోతుందని కలలు కంటారు. అనుకున్నట్లుగానే కొందరి జీవితాలు మారిపోయాయి. అయితే సినిమాల్లో అవకాశం రావాలంటే.. ముఖ్యంగా హీరోయిన్ గా రాణించాలంటే అందంగా ఉండాలి. ఈ తరుణంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే సమయంలో కొందరు అమ్మాయిలు బ్యూటీ ఫార్లర్, తదితర వాటితో బ్యూటీనెస్ పెంచుకుంటారు. అయితే ఎంత అందంగా ఉన్నా కొందరు ఫేస్ అట్రాక్షన్ అనిపించదు. ఇప్పుడున్న కొందరు హీరోయిన్లు సినిమాల్లోకి వచ్చే సమయంలో గుర్తుపట్టలేని విధంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆకర్షణీయంగా మారారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ కు సంబంధించిన పాత పిక్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు? అప్పుడు ఎలా ఉండేది?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోకి కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఎందరు వచ్చినా కొందరు స్ఠార్ హీరోయిన్లకు ఉన్న గుర్తింపు అలాగే ఉంది. వారిలో తమన్నా బాటియా ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. ఈమె తెలుగు పరిశ్రమకు రాకముందు కొన్ని సినిమాల్లో నటించారు. కానీ ఆ సినిమాల్లోని తమన్నాను చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఆ సమయంలో సాధారణంగా ఉండేవారు. అయితే తెలుగులో ఎంట్రీ ఇచ్చే సమయంలో అంటే మంచు మనోజ్ తో కలిసి నటించిన ‘శ్రీ’ సినిమా సమయంలో తమన్నా కాస్త బెటర్ అయ్యారు. ఇక ఆ తరువాత వచ్చిన ‘హ్యాపీడేస్’లో తమన్న అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తెలుగులోకి రాకముందు తమన్నా ‘చాంద్ సా రోషన్ చెహ్రై’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలో తమన్న వయసు 15 సంవత్సరాలు మాత్రమే. ఈ సందర్భంగా తమన్నా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తమన్నా గుర్తు పట్టలేని విధంగా ఉన్నారు. ఆ పిక్ తో ఇప్పడు సోషల్ మీడియాలో కొందరు ప్రత్యేకంగా చర్చలు పెట్టుకుంటున్నారు. ఎలా ఉండే తమన్నా ఎలా మారింది? అని కొందరు క్యాప్షన్ పెట్టి అప్పటి, ఇప్పటి ఫొటోలతో జోడిస్తున్నారు.
తెలుగులో ‘శ్రీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తరువాత శేఖర్ కమ్ముల మూవీ ‘హ్యాపీ డేస్’ తో గుర్తింపు పొందారు. ఆ తరువాత తెలుగు స్టార్ హీరోలందరితో నటించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ తన అందం, నటనతో తమన్నా ఆకట్టుకున్నారు. అయితే ఎక్కువగా తెలుగులోనే తమన్నాకు అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత వెబ్ సిరీస్ ల్లోనూ తమన్నా సందడి చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా తమన్నాకు చెందిన పాత వీడియో వైరల్ అవుతోంది. అయితే పెళ్లయిన తరువాత తమన్నా సినిమాల్లో నటిస్తుందా? లేదా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. కాజోల్ వంటి వారు పెళ్లయ్యాక కూడా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. తమన్నాను చేసుకోబోయే నటుడు విజయ్ వర్మ కూడా తెలుగులో ‘ఎంసీఏ’ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే.