Mahindra: దేశంలో మ్యూజిక్‌కు తగ్గట్టుగా డాన్స్ చేసే ఫీచర్ ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ SUV కారును మహీంద్రా కంపెనీ తయారు చేస్తోంది. సాధారణంగా ఈ ఫీచర్ చైనాకు చెందిన BYD ఎలక్ట్రిక్ కార్లలో కనిపిస్తుంది. అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా తన ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ కార్ల ద్వారా కేవలం 40 రోజుల్లో ఒక అద్భుతమైన రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు దేశంలో ఏ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ కూడా ఈ రికార్డును సాధించలేకపోయింది. మ్యూజిక్‌కు డాన్స్ చేసే ఎలక్ట్రిక్ కారు మరేదో కాదు Mahindra BE 6 . మహీంద్రా ఇటీవల తన జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. అందులో కంపెనీ ఎలక్ట్రిక్ కార్లైన BE 6, Mahindra XEV 9e అమ్మకాల గణాంకాలను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
Also Read: ‘కూలీ’ టీజర్: రజినీకాంత్ విజిల్ సౌండ్ పాన్ ఇండియాలో వినిపిస్తుందా..?
హీంద్రా ఎలక్ట్రిక్ కార్ల రికార్డు
మహీంద్రా గత ఏడాది చివర్లో తన రెండు ఎలక్ట్రిక్ కార్లైన BE 6, XEV 9e లను విడుదల చేసింది. వీటిలో BE 6 ధర రూ.18.90 లక్షలు, XEV 9e ధర రూ.21.90 లక్షలుగా నిర్ణయించారు. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లకు బుకింగ్ ప్రారంభించిన మొదటి రోజే 30,179 యూనిట్ల రికార్డు స్థాయిలో బుకింగ్స్ వచ్చాయి. వీటి బుకింగ్ విలువ రూ.7,472 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్లు మరో కొత్త రికార్డును సృష్టించాయి. మహీంద్రా కేవలం 40 రోజుల వ్యవధిలో ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల 6,300 యూనిట్లను డెలివరీ చేసింది. కంపెనీ ఈ రెండు కార్ల డెలివరీని 20 మార్చి 2025 నుండి ప్రారంభించి, ఏప్రిల్ 30 నాటికి ఇన్ని వాహనాలను డెలివరీ చేసిన రికార్డును సొంతం చేసుకుంది.
మహీంద్రా తెలిపిన వివరాల ప్రకారం.. వారి మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో 59 శాతం వాటా ఫ్లాగ్‌షిప్ మోడల్ XEV 9e దే. మిగిలిన బుకింగ్‌లను రాబోయే 4 నుండి 5 నెలల్లో డెలివరీ చేస్తామని కంపెనీ పేర్కొంది.
మ్యూజిక్‌కు డాన్స్ చేసే కారు
మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUV లైన BE 6, XEV 9e లలో ‘పార్టీ మోడ్’ లేదా ‘గ్రూవ్ మీ’ అనే స్పెషల్ ఫీచర్ ఉంది. ఈ కార్లలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్, హెడ్‌లైట్, DRL, టెయిల్ లైట్ , ఇంటీరియర్ యాంబియెంట్ లైటింగ్ వంటి వాటిని మ్యూజిక్ కు అనుగుణంగా సింక్రోనైజ్ చేసి ఒక ప్రత్యేకమైన లైటింగ్ డిస్‌ప్లేను క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ కార్ల ప్రత్యేకమైన షాకర్లు కారును కదిలేలా చేస్తాయి. అది డాన్స్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. BYD కార్లతో పాటు, టెస్లా కార్లలో కూడా ‘లైట్ షో’ పేరుతో ఇలాంటి ఫీచర్ ఉంది.