Coolie Teaser: ‘ రజనీకాంత్ కి తమిళ్ తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, రజనీకాంత్ పేర్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు. వీళ్లిద్దరి మధ్య తీవ్రమైన పోటీ అయితే నడిచేది. ఇక రజనీకాంత్ సినిమాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ సక్సెస్ గా నిలిచేవి. అందువల్ల రజనీకాంత్ కి తెలుగులో కూడా చాలా ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.
Also Read: ‘వార్ 2’ థియేట్రికల్ రైట్స్ ఇంత తక్కువనా..? ఆంధ్ర రేట్ అయితే దారుణం!
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) లాంటి దర్శకుడు సైతం పాన్ ఇండియా సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన విక్రమ్ (Vikram) సినిమా కమలహాసన్ (kamal hasan) కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. ఇక ఈ మూవీ తర్వాత విజయ్ తో చేసిన లియో సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించినప్పటికి కలెక్షన్స్ పరంగా భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ఆయన రజనీకాంత్ తో చేస్తున్న ‘కూలీ’ (Cooli) సినిమాను ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో గత కొద్దిసేపటికి క్రితమే ఈ సినిమా రిలీజ్ కి మరో 100 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ‘100 డేస్ టు గో’ అంటూ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
అయితే ఈ టీజర్ లో ఉపేంద్ర, నాగార్జున, సత్య రాజు లాంటి స్టార్ హీరోలను బ్యాక్ నుంచి ఓపెన్ చేసినప్పటికి వాళ్ళ ఫేస్ మాత్రం రిపీట్ చేయలేడు. రజినీకాంత్ ను మాత్రం బ్యాక్ షాట్ నుంచి ఎస్టాబ్లిష్ చేసినప్పటికి తన ఫేస్ ను రివిల్ చేయడమే కాకుండా అతని చేత విజిల్ వేయించారు. నిజానికి తమిళ ప్రేక్షకులు తమ అభిమాన హీరో విజిల్ కొడితే ఆనంద పడుతూ ఉంటారు.
అందుకోసమని రజనీకాంత్ తో ఒక భారీ విజిల్ అయితే వేయించారు. మరి రజినీకాంత్ వేసిన విజిల్ రీసౌండ్ కి పాన్ ఇండియా వైడ్ గా ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడతాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక లోకేష్ కనకరాజ్ అంటే డిఫరెంట్ మేకింగ్ తో సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది. అందుకే ఆయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు… ఈ సినిమాతో రజినీకాంత్ కి భారీ సక్సెస్ ని కట్టబెడతాడా? ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న రజనీకాంత్ ను పాన్ ఇండియా స్టార్ గా మారుస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…