7 Seater Cars: కారు కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఏది కొనాలి? ఎక్కడ కొనాలి? అనే విషయంలో కొందరు పొరపాట్లు చేస్తుంటారు. కానీ యూనివర్సల్ గా ఆలోచించేంది మాత్రం తక్కువ బడ్జెట్ లో పెద్ద కారు కొనాలని. వాస్తవానికి ఫీచర్స్, మైలేజ్ ను భట్టి ధర ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు మాత్రం తక్కువ ధరలోనే 7 సీటర్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటి మైలేజ్ విషయంలోనే ఏమాత్రం తక్కువ కాకుండా ఉన్నాయి. మరి అలాంటి కార్ల గురించి తెలుసుకుందామా..
రెనాల్ట్ కంపెనీ నుంచి కారు వాడే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా డస్టర్ అందరినీ ఆకట్టుకుంటి. దీని నుంచి ట్రైబర్ విపరీతంగా ఆకర్సిస్తోంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 71 బీహెచ్ పీ పవర్ తో పాటు 96 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 4 స్టార్ రేటింగ్ తో 8 అంగుళాల ఇన్పోటెన్మెంట్ సిస్టమ్ ను కలిగి ఉన్న దీనిని రూ.6.34 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. రెనో ట్రైబర్ ఏఎంటీ రూ.8.98 లక్షల ప్రారంభ ధర ఉంది.
మహీంద్రా నుంచి బొలెరో నియో గాల్లో దూసుకుపోతుంది. ఇది డీజిల్ వేరియంట్ లో తక్కువ ధరను కలిగి ఉంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 99 బీహెచ్ పీ పవర్, 260 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ కారు 9.64 లక్షల ప్రారంభ ధరను కలిగి ఉంది. దక్షిణ కొరియా కంపెనీకి చెంది కియా కార్లు భారత్ రోడ్లపై దూసుకెళ్తున్నాయి. ఈ కపెంనీకి చెందిన కియా కేరెన్స్ 1.5 లీటర్ టర్బో ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ను కలిగి ఉంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 158 బీహెచ్ పీ పవర్, 253 ఎన్ ఎంట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.10.45 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
మారుతి కంపెనీ నుంచి ఎన్నో మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కంపనీ నుంచి వచ్చిన ఎర్టీగా 7 సీటర్ ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటోంది. ఎర్టీగా 1.5 లీటర్ పెట్రోల్ పవర్ ట్రైన్ తో పాటు 102 బీహెచ్ పీ పవర్, 136.8 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.8.64 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టయోటా కంపెనీకి చెందిన రూమియన్ కూడా తక్కువ బడ్జెట్ లో పొందవచ్చు. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు 99 బీహెచ్ పీ, 260 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది దీనిని రూ.9.64 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు