Salaar Trailer: సలార్ మూవీకి ఉన్న హైప్ రీత్యా ట్రైలర్ కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. అందరి నిరీక్షణకు తెరదించుతూ డిసెంబర్ 1న రాత్రి 7:19 నిమిషాలకు సలార్ ట్రైలర్ విడుదల చేశారు. 3 నిమిషాల 45 సెకండ్స్ నిడివి కలిగిన ట్రైలర్ దుమ్మురేపింది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంది. ఖాన్సార్ అనే ఒక ఊహాజనిత రాజ్యం కోసం వర్గాల మధ్య పోరే సలార్ మూవీ. పృథ్విరాజ్ ప్రభాస్ మిత్రుడిగా కనిపిస్తున్నాడు. మిత్రుడి కోసం శత్రు మూకల మీద యుద్ధం ప్రకటించిన యోధుడిగా ప్రభాస్ ని పరిచయం చేశారు.
ప్రభాస్ లుక్, వైలెన్స్, విజువల్స్ అంచనాలకు మించి ఉన్నాయి. సలార్ ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో కెజిఎఫ్ 2 రికార్డును టచ్ చేస్తుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజిఎఫ్ 2 విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్ర ట్రైలర్ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. 24 గంటల్లో కెజిఎఫ్ 2 ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 106.5 మిలియన్ వ్యూస్ రాబట్టింది. గత రెండేళ్లుగా ఈ రికార్డు సేఫ్ గా ఉంది.
కెజిఎఫ్ 2 తర్వాత రెండో స్థానంలో 74 మిలియన్ వ్యూస్ తో ఆదిపురుష్ ఉంది. ఇక లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ మూవీ ట్రైలర్ 71.3 మిలియన్ వ్యూస్ తో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో సలార్ ట్రైలర్ ఉంది. 16 గంటల్లో సలార్ ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 58 మిలియన్ వ్యూస్ రాబట్టింది. మరో 8 గంటల సమయం ఉండగా… సలార్ కెజిఎఫ్ 2 రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
ట్రెండ్ చూస్తే కష్టమే అనిపిస్తుంది. ఆదిపురుష్ రికార్డు బ్రేక్ చేసి టాప్ 2లో వెళ్లే ఛాన్స్ ఉంది. కెజిఎఫ్ 2 రికార్డు సలార్ బ్రేక్ చేయలేకపోతే మరొకరికి ఇంకా కష్టం. కెజిఎఫ్ 2 వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ సలార్ తో కెజిఎఫ్ రికార్డులు బ్రేక్ చేస్తాడని చిత్ర వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. సలార్ పై ఉన్న హైప్ నేపథ్యంలో విపరీతంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 175 కోట్ల వరకు అమ్మారట. ఏపీ/తెలంగాణలలో సలార్ రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. ఆంధ్ పెద్ద లక్ష్యం సలార్ ముందు ఉంది. సలార్ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతి బాబు, బాబీ సింహ కీలక రోల్స్ చేశారు. కాగా ప్రభాస్ నటించిన గత రెండు చిత్రాలు రాధే శ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్ అయ్యాయి. సలార్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాలని ప్రభాస్ భావిస్తున్నాడు.
