Lava Blaze Duo 3: స్మార్ట్ఫోన్ మార్కెట్ అంతకంతకు పెరుగుతోంది. అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లో కొత్త కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కంపెనీలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫోన్లలో ప్రవేశపెడుతున్నాయి. వినియోగదారుల అవసరాల ఆధారంగా ప్రతి ఏడాది కొత్త కొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. గతంలో ఫోన్ల బ్యాటరీ సామర్థ్యం ఒక స్థాయి వరకే ఉండేది. కానీ ఇప్పుడు అంతకుమించి అనే విధంగా బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుతున్న కంపెనీలు.. మిగతా వాటి విషయంలో కూడా అలాంటి విధానాన్ని కొనసాగిస్తున్నాయి.
2026 లో ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి లావా కంపెనీ కూడా చేరిపోయింది. లావా కంపెనీ తొలిసారిగా డ్యూయల్ డిస్ ప్లే తో స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. దీనికి blaze duo 3 అని పేరు పెట్టింది. ఈ ఫోన్లో రెగ్యులర్ డిస్ప్లే తోపాటు వెనుక మరో చిన్న డిస్ప్లే కూడా వస్తుంది.
Lava blaze duo 3 మోడల్ లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లో లభిస్తుంది. దీని ధర 16 వేల 999 రూపాయలకు కంపెనీ నిర్ణయించింది. లాంచ్ ఆఫర్లో భాగంగా ఈ కంపెనీ కొన్ని బ్యాంకార్డులపై వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తుంది. అమెజాన్ ఇండియాలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Lava blaze duo 3 మోడల్ లో 6.7 ఇంచ్ AMOLED 120h z display ఉంది.
సెకండరీ విభాగానికి వస్తే 1.6 ఇంచ్ AMOLED డిస్ ప్లే ఉంది.
మీడియా టెక్ డైమన్ సిటీ 7060 ప్రాసెసర్ ఉంది. 6 జి బి రామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. 50 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న వెనుక కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సల్. బ్యాటరీ సామర్థ్యం 5000 mAh, చార్జింగ్ కెపాసిటీ 33 w ఫాస్ట్ ఛార్జింగ్.