Director Teja And Prabhas: ‘చిత్రం’ సినిమాతో యూత్ ఫుల్ సబ్జెక్ట్ ని సక్సెస్ ఫుల్ గా డీల్ చేసిన దర్శకుడు తేజ…ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆ తర్వాత ‘నువ్వు నేను’ , ‘జయం’ లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. అప్పుడున్న ప్రతి ఒక్క హీరో తేజ డైరెక్షన్లో ఒక్క సినిమా అయిన చేయాలి అనేంతలా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలాంటి తేజ గత కొద్ది రోజుల నుంచి సరైన సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు. కారణమేదైనా కూడా ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడం అతని అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేస్తుంది…ఇక తేజ మహేష్ బాబు తో చేసిన నిజం సినిమా సైతం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక అప్పట్లో తేజ – ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి.
తేజ సైతం ప్రభాస్ తో సినిమా చేయడానికి కథను రెడీ చేసుకున్నాడట. కానీ ఆఖరి నిమిషంలో ఆ సినిమా పట్టా లెక్కలేదు. కారణం ఏదైనా కూడా ప్రభాస్ మాస్ హీరో అతని ఇమేజ్ ను హ్యాండిల్ చేయగలిగే కథని తేజ రాయలేడు. కాబట్టి ప్రభాస్ లాస్ట్ మినిట్ లో ఆయనతో సినిమాను వద్దనుకున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి.
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియాలో తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అతనితో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు…ఇక తేజ సైతం డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. రానా ను హీరోగా పెట్టి ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాని చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడంతో తేజ ఈజ్ బ్యాక్ అంటూ అందరు అతన్ని కొనియాడారు.
కానీ వచ్చిన సినిమాలతో ఆయన ఏమాత్రం తన సత్తాని చాటుకోలేకపోయాడు. ఇక ఇప్పటికైనా గొప్ప సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే బాగుంటుందంటూ తేజ అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…