Kia Syros: భారతదేశంలో ఎస్ యూవీలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. రూ.10ల లోపు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన SUV కొనాలనుకుంటున్నారా? అయితే రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే కొన్ని అద్భుతమైన కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రితం ఈ ధరల శ్రేణిలో విడుదలైన కియా సిరోస్ BNCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఈ కారు టాటా మోటార్స్ పాపులర్ SUV నెక్సాన్, స్కోడా కంపెనీ కైలాక్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ మూడు కార్లు స్ట్రాంగ్ బాడీ నిర్మాణంతో వస్తున్నప్పటికీ పెద్దలు, పిల్లల సేఫ్టీ విషయంలో ఏ కారు అత్యధిక పాయింట్లు సాధించిందో తెలుసుకుందాం.
Also Read: తక్కువ ధరలో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు.. కియా EV4 మార్కెట్‌ను షేక్ చేస్తుందా?
సేఫ్టీ రేటింగ్ వివరాలు
కియా సిరోస్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. అయితే ఈ కారు పెద్దల సేఫ్టీ, పిల్లల సేఫ్టీ విషయంలో ఎన్ని పాయింట్లు సాధించిందో తెలుసా? BNCAP అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ SUV పెద్దల సేఫ్టీ విషయంలో 32కి 30.21 పాయింట్లు, పిల్లల సేఫ్టీ విషయంలో 49కి 44.42 పాయింట్లు సాధించింది.
టాటా నెక్సాన్ విషయానికి వస్తే, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన ఈ కారు పెద్దల సేఫ్టీలో 32కి 29.41 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో 49కి 43.83 పాయింట్లు పొందింది. మరోవైపు, 5 స్టార్ రేటింగ్ కలిగిన స్కోడా కైలాక్ పిల్లల సేఫ్టీలో 49కి 45 పాయింట్లు, పెద్దల సేఫ్టీలో 32కి 30.88 పాయింట్లు సాధించింది.
ధరల వివరాలు
కియా సిరోస్ ధర రూ.9.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ.15.99 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. మరోవైపు టాటా నెక్సాన్ ప్రారంభ ధర రూ.7.99 లక్షల(ఎక్స్-షోరూమ్) కాగా, ఈ కారు టాప్ మోడల్‌ను కొనుగోలు చేయాలంటే రూ.15.39 లక్షల(ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది.
స్కోడా కైలాక్ విషయానికి వస్తే.. ఈ కారు బేస్ వేరియంట్ రూ.7.89 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ SUV టాప్ మోడల్‌ను కొనుగోలు చేయాలంటే రూ.14. 40 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.