Toyota Fortuner: ఎమ్మెల్యేలు, ఎంపీలు వంటి ప్రజాప్రతినిధులు తిరిగే టయోటా ఫార్చ్యూనర్ కారులో తిరగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దాని రాజసం, పవర్ఫుల్ లుక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కానీ దాని ధర చూసి చాలామంది వెనక్కి తగ్గుతారు. అయితే ఇప్పుడు కేవలం రూ.50 వేలకే ఈ ఎస్యూవీని సొంతం చేసుకోవచ్చు. ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం. టయోటా ఫార్చ్యూనర్ మార్కెట్‌లో పెట్రోల్ , డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. ఈ కారు 2694సీసీ, DOHC, డ్యూయల్ VVT-i ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 166 PS పవర్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా, 245 Nm టార్క్‌ను కూడా అందిస్తుంది. టయోటా ఫార్చ్యూనర్ 7 సీట్ల కారు, దీని లుక్‌కు చాలా మంది అభిమానులున్నారు. ఈ కారును చూసిన తర్వాత ఒక్కసారైనా ఇది నా సొంతం అయితే ఎంత బాగుంటుందని అందరూ అనుకోని వారుండరు. కానీ ఇప్పుడు ఆ కల నిజం చేసుకోవచ్చు. మీరు కేవలం రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో ఈ కారును కొనుగోలు చేస్తే ఎంత లోన్ తీసుకోవాలి.. ప్రతి నెల ఎంత ఈఎంఐ కట్టాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: తక్కువ ధరలో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు.. కియా EV4 మార్కెట్‌ను షేక్ చేస్తుందా?
టయోటా ఫార్చ్యూనర్ కోసం పదేళ్ల EMI ప్లాన్
టయోటా ఫార్చ్యూనర్ ఒక పాపులర్ SUV, దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ.39.32 లక్షలు. ఎవరైనా దీనిని కేవలం రూ.50 వేల డౌన్‌పేమెంట్ చెల్లించి కొనాలనుకుంటే వారు దాదాపు రూ.38.82 లక్షల కారు లోన్ తీసుకోవలసి ఉంటుంది. ఈ లోన్ పదేళ్లు అంటే 120నెల కాలవ్యవధికి తీసుకుంటే ప్రతి నెల ఈఎంఐ దాదాపు రూ.47వేల నుంచి 49వేల మధ్య ఉండవచ్చు(ఇది 9% నుండి 10% వడ్డీ రేటు అంచనా ప్రకారం).
ఈఎంఐ అసలు ధర వడ్డీ రేటు, బ్యాంక్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కారు కొనుగోలు చేసే ముందు బ్యాంక్ నుండి పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదే మీరు 7 సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే.. మీరు నెలవారీ EMIగా కేవలం రూ.62,458 చెల్లించవలసి ఉంటుంది.
టయోటా ఫార్చ్యూనర్ ఫీచర్లు
టయోటా ఫార్చ్యూనర్‌లో పవర్ ఫుల్వ ఇంజన్‌తో పాటు, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఈ స్ట్రాంగ్ కారులో మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అనేక సేఫ్టీ ఫీచర్స్ లభిస్తాయి. మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్‌తో వచ్చే ఈ కారులో పవర్ అడ్జస్టబుల్ ఎక్స్‌టీరియర్ రియర్ వ్యూ మిర్రర్ కూడా ఉంది. ఇందులో కలర్ ఆఫ్షన్ కూడా ఉంటుంది. మన ఇష్టానికి అనుగుణంగా నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.