Kia: కియా కంపెనీ అనగానే చాలా మందికి SUV, MPV కార్లే గుర్తుకు వస్తాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా కియా అందుబాటు ధరలో లగ్జరీ కార్లను తయారు చేసే కంపెనీగా గుర్తింపు పొందింది. ఇప్పుడు కియా గ్లోబల్ స్థాయిలో తన మొదటి ఎలక్ట్రిక్ సెడాన్ కారును తీసుకురాబోతోంది. విషయం ఏంటంటే ఈ కారు టెస్లా, బీవైడీ వంటి ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ను షేక్ చేయగలదు. కియా తన మొదటి గ్లోబల్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు అయిన కియా EV4ని ఆవిష్కరించింది. న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో కియా ఈ కారును మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసింది. దీని ప్రత్యేకతలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం.
Also Read: మళ్లీ పెరగనున్న రిచార్జ్ లు.. ఎయిర్ టెల్, జీయోల నిర్ణయం..
అద్భుతమైన డిజైన్:
కియా EV4 కారును దాని 400V ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (E-GMP)పై అభివృద్ధి చేశారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ EV6, EV9 వంటి కార్లను కూడా అభివృద్ధి చేసింది. కంపెనీ ఈ సెడాన్‌కు స్పోర్టీ లుక్‌ను అందించింది. వెనుకవైపు నిలువుగా ఉండే టెయిల్ లైట్స్ ఇచ్చింది. కారు పైకప్పు డిజైన్ స్ప్లిట్ రూఫ్ స్పాయిలర్‌తో వస్తుంది. దాని బంపర్ చాలా అద్భుతంగా డిజైన్ చేసింది. ఇది కంపెనీ Opposites United డిజైన్ ఫిలాసఫీకి అనుగుణంగా ఉంది. అందుకే దీని ముందు భాగం తక్కువగా ఉంటే, రూఫ్‌లైన్ వెనుక వరకు పొడవుగా ఉంటుంది.
ఈ కారు 17-ఇంచుల ఏరో వీల్స్‌తో వస్తుంది. కంపెనీ 19-ఇంచుల వీల్ ఆప్షన్‌ను కూడా ఇచ్చింది. కారులో 30-అంగుళాల వైడ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఇందులో 12.3-అంగుళాల డ్యూయల్ స్క్రీన్, 5-అంగుళాల క్లైమేట్ డిస్‌ప్లే ఉన్నాయి.
పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్
ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో వస్తుంది. 58.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో 378 కిమీ రేంజ్ లభిస్తుంది. అయితే 81.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో 531 కిమీ వరకు రేంజ్ పొందవచ్చు. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కారు. ఇందులో 150 kW మోటార్ తో వస్తుంది. ఇది కారుకు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. చిన్న బ్యాటరీతో ఈ కారు DC ఫాస్ట్ ఛార్జింగ్‌పై కేవలం 29 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అయితే పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఇదే సమయం 31 నిమిషాలకు పెరుగుతుంది.
టెస్లా-బీవైడీకి షాక్
ప్రస్తుతం ప్రపంచంలోని పెద్ద కార్ కంపెనీలలో టెస్లా, బీవైడీ ప్రధానంగా ఎలక్ట్రిక్ సెడాన్ కార్లను తయారు చేస్తున్నాయి. అయితే భారతదేశం వంటి పెద్ద మార్కెట్‌లో టాటా మోటార్స్ టిగోర్ కూడా ఒక ఎలక్ట్రిక్ సెడాన్ కారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో కియాకు ఉన్న బలమైన మార్కెట్ ఉనికి ఈ సెగ్మెంట్‌లో బీవైడీ, టెస్లాను వెనక్కి నెట్టగలదు. కియా EV4 అంచనా ధర కూడా రూ.15లక్షల నుంచి రూ.20లక్షల మధ్య ఉండవచ్చు.