Kia Sonet: దక్షిణ కొరియా కంపెనీకి చెందిన ‘కియా’ కారు భారత మార్కెట్లో దూసుకుపోతంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎన్నో మోడళ్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. దీని నుంచి రిలీజ్ అయిన ‘సోనెట్’ అమ్మకాల్లో దూసుకుపోతుంది. కియా సోనెట్ ఎస్ యూవీని 2020 సెప్టెంబర్ లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పి వరకు భారత్ లోనే కాకుండా విదేశాల్లో ఈ మోడల్ ను ఆదరిస్తున్నారు. తాజాగా తెలిపిన వివరాల ప్రకారం సోనెట్ కు ఇంకా ఆదరణ తగ్గలేదని తెలుస్తోంది.
కియా సోనెట్ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ తో పాటు 1.5 డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది పెట్రోల్ ఇంజిన్ కు 7 స్పీడ్ డ్యూయెల్ గేర్ బాక్స్ ను, డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ పొందుతుంది. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ , డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ సిస్టమ్ రెండూ చూడొచ్చు. ఆటోమేటిక్ క్లైమెట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అలరిస్తున్నాయి. వైర్ లెస్ చార్జర్ వంటిని వినియోగదారులను ఆకర్షిస్తోంది.
కియా సోనేట్ ను సేప్టీ కారుగా కూడా పేర్కొంటున్నారు. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్,బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్న కియా సోనెట్ ను రూ. 8.99 లక్షల నుంచి రూ. 15.75 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ఎస్ యూవీ కార్లలో ధర తక్కువగా ఉన్న కారు సోనెట్ అని కొందరు పేర్కొంటారు. ఇది టాటా నెక్సాన్, హ్యాందాయ్ వెన్యూ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.
మేడ్ ఇన్ ఇండియా అయినా కియా సోనెట్ ఎస్ యూవీని ఆఫ్రికన్,మిడిల్ ఈస్టర్న్ వంటి దేశాల్లో కూడా విక్రయిస్తున్నారు. దీంతో ఈ మోడల్ ను బాగా ఆదరించారు. ఇటీవల వెలువరించిన లెక్కల ప్రకారం కంపెనీ సోనెట్ ను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 3,17,754 యూనిట్లు అమ్ముడుపోయాయి. 4 సంత్సరాల కాల వ్యవధిలో అమ్మకాల్లో సోనెట్ వాటా 33.3 శాత ఉండడం విశేషం. ఇందులో పెట్రోల్ కార్లు 63 శాతం, డీజిల్ కార్లు 37 శాతం ఉన్నాయి.