Maruthi Swift: 19 ఏళ్లు అయినా టాప్ 10లో.. మారుతి సుజుకీ స్విప్ట్ సక్సెస్ కు కారణాలు ఇవేనా?

2005 సంవత్సరంలో సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన స్విప్ట్ ఏళ్ల తరబడి వన్నెతగ్గని మోడల్ గా నిరూపించుకుంటోంది. ఇప్పటికీ స్విప్ట్ కారును కొనుగోలు చేసేవారు ఎక్కువే ఉన్నారని చెప్పుకోవచ్చు.

Written By: Srinivas, Updated On : April 27, 2024 3:30 pm

Maruti Swift 2024

Follow us on

Maruthi Swift:  మారుతి సుజుకీ.. ఈ పేరు కార్ల ప్రపంచంలో ఒక సంచలనం అని చెప్పొచ్చు. రకరకాల కార్లను వినియోగదారులకు పరిచయం చేస్తూ వారి మన్నననలను పొందుతోందీ కంపెనీ. దీని నుంచి వచ్చిన స్విప్ట్ ఇప్పటికీ బెస్ట్ కారుగానే ఉంటోంది. 2005 సంవత్సరంలో సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన స్విప్ట్ ఏళ్ల తరబడి వన్నెతగ్గని మోడల్ గా నిరూపించుకుంటోంది. ఇప్పటికీ స్విప్ట్ కారును కొనుగోలు చేసేవారు ఎక్కువే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ మోడల్ ను లేటేస్టుగా తీర్చి దిద్ది స్విప్ట్ నెక్ట్స్ జనరేషన్ గా మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అయినా పాత మోడల్ ను కోరుకునేవారు ఉన్నారు. స్విప్ట్ అంతలా సక్సెస్ కావడానికి కారణాలేంటంటే?

మారుతి సుజుకీ స్విప్ట్ 1.2 లీటర్ సీఎన్ జీ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో సీఎన్ జీ వెర్షన్ కూడా ఉంది. పెట్రోల్ ఇంజిన్ 22.38 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. సీఎన్ జీ వెర్షన్ 30.0 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ కంటే ఎక్కువ అని చెప్పవచ్చు. మారుతి స్విప్ట్ ఫీచర్స్ కూడా అద్భుతం అని చెప్పవచ్చు. ఇందులో ఎన్నో ఫ్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. వీటితో పాటు సేఫ్టీకి కోసం డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ వంటివి ఆకర్షిస్తాయి.

2005లో బయటకు వచ్చిన స్విప్ట్ కొత్త డిజైన్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లు వివిధ డిజైన్లలో వచ్చింది. ఇవి వినియోగదారులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంతో స్విప్ట్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. 2023-2024 ఆర్థిక ఏడాదిలో స్విప్ట్ 1,95,321 యూనిట్లు విక్రయించారు. మారుతి స్విప్ట్ కు హ్యుందాయ్ నుంచి గ్రాండ్ ఐ 10 నియోస్ వంటివి మార్కెట్లోకి వచ్చి విపరీతమైన పోటీ ఇచ్చాయి. కానీ స్విప్ట్ అమ్మకాలు ఏమాత్రం తగ్గలేదు.

ఇప్పుడు స్విప్ట్ కొత్త వెర్షన్ లో రాబోతుంది. ఇటీవలే దీనిని జపాన్ లో క్రాష్ టెస్టింగ్ చేశారు. పాత స్విప్ట్ కంటే కొత్తది రక్షణలో మెరుగైన స్టార్ రేటింగ్ సాధించింది. మే నెలలో ఇది రోడ్లపై కి రాబోతుంది. ఈ నేపథ్యంలో పాత స్విప్ట్ కు బదులు కొత్త దానిని తెచ్చుకోవాలని కొందరు చూస్తున్నారు. మరికొందరు కొత్త కారును కొనుగోలు చేయాలనుకునేవారు స్విప్ట్ ను బుకింగ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.