Kia: 2021లో మొదటిసారి విడుదలైన కియా కారెన్స్ MPV సంస్థకు మంచి లాభాలను అందించింది. కంపెనీ తాజాగా దీని అమ్మకాల గురించి కొన్ని కొత్త విషయాలు వెల్లడించింది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కారెన్స్ యూనిట్లు అమ్ముడయ్యాయని తెలిపింది. కొత్తగా విడుదలైన కారెన్స్ క్లావిస్ MPV ఆవిష్కరణ సందర్భంగా కియా మాట్లాడుతూ.. మొత్తం కారెన్స్ అమ్మకాల్లో పెట్రోల్ వేరియంట్ల వాటా దాదాపు 58 శాతం ఉందని, డీజిల్ మోడల్‌ను 42 శాతం మంది కొనుగోలు చేస్తున్నారని వెల్లడించింది.
Also Read: ‘కూలీ’ కి రజినీకాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ తో ఒక బాహుబలి తీయొచ్చు తెలుసా!
కియా విడుదలైన కొద్ది కాలంలోనే మారుతి ఎర్టిగా, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి దిగ్గజాలు ఉన్న సెగ్మెంట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కియా కారెన్స్ కొనుగోలుదారుల్లో 32 శాతం మంది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను ఎంచుకున్నారని కంపెనీ తెలిపింది. కియా తన మూడు ఇంజిన్లలో రెండింటితో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ అందిస్తోంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్‌తో జత చేయగా, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ IMT, 7-స్పీడ్ DCTతో అందుబాటులో ఉంది. 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్‌తో వస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చాలా మంది కొనుగోలుదారులు దీని టాప్-ఎండ్ మోడల్‌ను కొనుగోలు చేస్తున్నారు.
త్వరలో విడుదల కానున్న కారెన్స్ క్లావిస్ వల్ల కియా కారెన్స్ మోడల్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ కొత్త MPV మే 8, 2025న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. ఇది కొత్త లుక్, ఎక్కువ ఫీచర్లు, అదనపు టెక్నాలజీతో కారెన్స్‌పై ఆధారపడిన మరింత ప్రీమియం వేరియంట్. కియా కారెన్స్, కారెన్స్ క్లావిస్ రెండూ ఒకే షోరూమ్‌లలో అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో ఈ రెండు మోడళ్లకు ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా చేర్చనున్నారు. ఇది భారతదేశంలో కియా మొట్టమొదటి మాస్-మార్కెట్ EV అవుతుంది.
కొత్త తరం మోడళ్ల నుంచి ప్రేరణ పొందిన ప్రీమియం స్టైలింగ్‌తో కారెన్స్ క్లావిస్ ద్వారా వ్యక్తిగత కార్ల కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంటోంది కంపెనీ. రాబోయే ఈ కారులో లెవెల్ 2 ADAS, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, డిజిటల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం పనోరమిక్ స్క్రీన్, కొత్త స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్‌లో 64-రంగుల యాంబియంట్ లైటింగ్, 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, మరెన్నో ఫీచర్లు ఉండనున్నాయి.