Coolie: 7 పదుల వయస్సు దాటినా, నేటి తరం పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ కి పోటీ ని ఇస్తున్న ఏకైక సూపర్ స్టార్ ఒక్క రజినీకాంత్(Superstar Rajinikanth) మాత్రమే. ఆయన వయస్సు లో ఉన్న హీరోలందరూ సినిమాల నుండి రిటైర్మెంట్ ఇచ్చేసారు, కొంతమంది అయితే హీరో రోల్స్ కి దూరమై క్యారక్టర్ రోల్స్ చేసుకుంటున్నారు. ఆయన వయస్సుతో సమానం కాకపోయినా, 70 వ ఏటలోకి ఈ ఏడాదిలో అడుగుపెడుతున్న మెగాస్టార్ చిరంజీవి కూడా నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ భారీ వసూళ్లను కొల్లగొడుతున్నారు కానీ, చిరంజీవి రేంజ్ కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ రజినీకాంత్ తమిళం, తెలుగు,మలయాళం, కన్నడ ఇలా ప్రతీ భాషలోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమా పెద్ద హిట్ అయితే మినిమం 700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి.
Also Read: ‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ తో సినిమా..హీరో ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!
‘జైలర్’ చిత్రం అందుకు ఉదాహరణ. ఈ సినిమాకు ముందు రజినీకాంత్ కి వరుసగా కొన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. వాటిని చూసి ఇక రజినీకాంత్ పని అయిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ ‘జైలర్’ చిత్రం తో ఆయన ఇచ్చిన సమాధానం దేశం మొత్తం రీ సౌండ్ వచ్చేలా చేసింది. ఇప్పుడు ఆయన లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) తో ‘కూలీ'(Coolie Movie) అనే చిత్రం చేసాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకునం ఈ చిత్రం ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఉపేంద్ర, అమీర్ ఖాన్(Amir Khan) వంటి సూపర్ స్టార్స్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం తమిళనాడు నుండి మొట్టమొదటి వెయ్యి కోట్ల సినిమాగా నిలుస్తుందని అక్కడి ట్రేడ్ పండితులు బలంగా నమ్ముతున్నారు.
అయితే కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజినీకాంత్ 260 నుండి 280 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడట. దేశ చరిత్ర లో ఏ ఇండియన్ యాక్టర్ కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకోలేదు. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి సూపర్ స్టార్స్ 100 నుండి 150 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి 170 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ రేంజ్ వాళ్ళు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని తీసుకోవచ్చు. వీళ్లందరినీ దాటి రజినీకాంత్ 7 పదుల వయస్సులో ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. అదే విధంగా కూలీ చిత్రం లో కీలక పాత్ర పోషించిన అక్కినేని నాగార్జున కూడా 24 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడట.