Kia Carens EV: కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇటీవల రిలీజ్ చేసిన అత్యంత చవకైన 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు కారెన్స్ క్లావిస్ ఈవీ బుకింగ్‌లు జులై 22 నుండి షురూ కానున్నాయి. ఆసక్తి ఉన్న కస్టమర్‌లు దీనిని కేవలం రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కైరెన్స్ క్లావిస్ ఈవీ, కొన్ని రోజుల క్రితం లాంచ్ అయిన 7 సీటర్ కారెన్స్ క్లావిస్ పెట్రోల్-డీజిల్ వెర్షన్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్. ఈ కారు 4 మోడళ్లలో అందుబాటులో ఉంది. అవి HTK+, HTX, ER HTX , ER HTX+. ఈ కారు ధర రూ.17.99 లక్షల నుండి రూ.24.49 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
Also Read: జస్టిస్ యశ్వంత్‌వర్మ అభిశంసన.. లోక్‌సభలో తీర్మానానికి కేంద్రం యోచన
డిజైన్ పరంగా ఇది పెట్రోల్-డీజిల్ కారెన్స్ క్లావిస్ మోడల్‌ను పోలి ఉంటుంది. అయితే, ఎలక్ట్రిక్ కారుకు కొన్ని మార్పులు చేశారు. ఉదాహరణకు, ఛార్జింగ్ పోర్ట్ ముందు భాగంలోని క్లోజ్డ్ గ్రిల్‌లో ఉంటుంది. ముందు వైపున LED DRLలు పొడవునా విస్తరించి ఉంటాయి. అదనంగా, 17-అంగుళాల కొత్త అల్లాయ్ వీల్స్, కింద అండర్‌బాడీ కవర్ ఉన్నాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 200 మి.మీ, ఇది ICE మోడల్ కంటే 5 మి.మీ ఎక్కువ.
ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది దేశంలో అత్యంత చవకైన త్రీ-రో ఎలక్ట్రిక్ కారు. ఇందులో స్టీరింగ్ కాలమ్‌పైనే గేర్ షిఫ్టర్ ఉంటుంది. క్యాబిన్‌లో స్పేస్ ఎక్కువ లభిస్తుంది. ఇందులో 26.6 అంగుళాల పెద్ద పనోరమిక్ స్క్రీన్ సెటప్ ఉంది. ఇందులో డిజిటల్ కన్సోల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రెండూ కలిసి ఉంటాయి. దీనితో పాటు, 90కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు, లెవెల్ 2 ADAS, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వన్-టచ్ టంబుల్ సెకండ్ రో సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్, ఎయిర్ ప్యూరిఫైయర్, అనేక ఇతర ఫీచర్లు కూడా అందించారు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ గురించి డైరెక్టర్ క్రిష్ సంచలన ట్వీట్!
క్లావిస్ ఈవీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్‌లతో వస్తుంది. బేస్ మోడల్లో 42 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 404 కిలోమీటర్లు వరకు నడుస్తుంది. ఇందులో 132 bhp మోటార్, 255 Nm టార్క్ లభిస్తుంది. ఎక్స్‌టెండెడ్ రేంజ్ మోడల్లో 51.4 kWh బ్యాటరీ ఉంటుంది. దీనివల్ల రేంజ్ 490 కిలోమీటర్లకు పెరుగుతుంది. ఇందులో 169 bhp మోటార్ ఉంటుంది. అయితే టార్క్ 255 Nm గానే ఉంటుంది. రెండు మోడళ్లలోనూ 4 లెవల్స్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది. ఇందులో i-Pedal మోడ్ కూడా ఉంది. ఇది ఒకే పెడల్‌తో కారును నడపవచ్చు. ప్యాడిల్ షిఫ్టర్‌ల ద్వారా బ్రేకింగ్ లెవల్ తమకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు.