Iceland lighthouse history: ఐస్‌ల్యాండ్ తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో వెస్ట్‌మాన్ దీవుల దగ్గర ఒక అద్భుతమైన లైట్‌హౌస్ ఉంది. ఇది 40 మీటర్ల (సుమారు 130 అడుగులు) ఎత్తులో, నిటారుగా ఉండే ఒక సముద్రపు కొండ మీద దీనిని కట్టారు. దీన్ని 1939లో నిర్మించారు. ఆ సమయంలో ఇప్పుడున్న హెలికాప్టర్లు లాంటి సౌకర్యాలు లేవు. మరి అంత ఎత్తులో ఉన్న కొండపైన ఈ లైట్‌హౌస్‌ను ఎలా కట్టారని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీని కోసం వారు మాస్టర్ క్లైంబర్‌లను ఉపయోగించారు. వీళ్ళు కొండలను ఎక్కడంలో నిపుణులు. వాళ్లే సామాగ్రిని, పనిముట్లను అంత ఎత్తుకు మోసుకెళ్లి ఈ లైట్‌హౌస్‌ను నిర్మించారు. ప్రపంచంలోనే ఇది అత్యంత ఒంటరిగా, అద్భుతంగా కనిపించే కట్టడాలలో ఒకటి. దీని పేరు థ్రిడ్రంగావిటి లైట్‌హౌస్.
Also Read: భారతీయ వలస జనాభా.. ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 దేశాలు ఇవే..!
అట్లాంటిక్ మహాసముద్రం అడుగున ఉగ్ర రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి ఈజీ మార్గం కూడా లేదు. అయినా ఈ మాస్టర్ క్లైంబర్‌లు ఆ ప్రమాదకరమైన కొండను ధైర్యంగా ఎక్కారు. వాళ్ళు పనిముట్లు, సామాగ్రి, చివరికి తమను తాము కూడా 40 మీటర్ల ఎత్తైన కొండ శిఖరానికి చేరవేశారు. ఇది నిజంగా మనిషి పట్టుదలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఈ లైట్‌హౌస్ కట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే.. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణించే ఓడలను ఆ ప్రాంతంలో ఉన్న ప్రమాదకరమైన సముద్రపు కొండల గురించి హెచ్చరించడం. ఇప్పటికీ ఆ లైట్‌హౌస్ ఉన్న స్థానం చూస్తే అది నిజంగా ఉన్నదానికంటే ఏదో ఫాంటసీ కథలో ఊహించినట్లుగా కనిపిస్తుంది. అది కేవలం ఓడలకు దారి చూపడానికి కాదు, ఒక అద్భుతమైన దృశ్యంలా ఉంటుంది.
ఈ లైట్‌హౌస్‌ను చేరుకోవడం చాలా కష్టం. వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి వెళ్లడానికి సాధ్యం అవుతుంది. ఇప్పుడు అప్పుడప్పుడు హెలికాప్టర్ల ద్వారా అక్కడికి వెళ్తున్నారు. థ్రిడ్రంగావిటి లైట్‌హౌస్ ఇప్పటికీ ఐస్‌ల్యాండ్ ప్రజల పట్టుదలకు, వాళ్ల ఇంజనీరింగ్ తెలివితేటలకు నిదర్శనం. అంతేకాకుండా ప్రకృతిలోని కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి మనుషులు ఎంతగా ప్రయత్నిస్తారో చెప్పడానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది.
Also Read: మూడు నెలల పాటు ప్రజలు ఇంట్లో మాత్రమే ఉండే ఈ గ్రామం గురించి తెలుసా?
1939లో థ్రిడ్రంగావిటి లైట్‌హౌస్ కట్టడం పూర్తైనప్పుడు ఆ కొండ శిఖరానికి చివరిగా ఎక్కడానికి ఎటువంటి సేఫ్టీ రైలింగ్ లేవు. కేవలం నిటారుగా ఉన్న రాతిని మాత్రమే ఎక్కాల్సి వచ్చేది. దశాబ్దాల తర్వాత గాని అక్కడికి హెలికాప్టర్ దిగడానికి ఒక ప్యాడ్ కట్టలేదు. అప్పుడే ప్రపంచంలోని అత్యంత మారుమూల లైట్‌హౌస్‌లలో ఒకటైన దీన్ని చేరుకోవడం ఈజీ అయింది.