Municipal Workers Update: ఏపీ ప్రభుత్వం ( Andhra Pradesh government)ఆ శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. లాంగ్ పీహెచ్ వర్కర్లకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వేలాదిమంది కార్మికులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. క్యాటగిరి వన్ వర్గంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనం ప్రస్తుతం రూ.21,500 నుంచి రూ.24,500కు పెంచింది. క్యాటగిరి 2 వేతనం రూ.18,500 నుంచి రూ.21,500 కు పెంచింది. క్యాటగిరి 3కు సంబంధించి రూ.15 వేల నుంచి రూ.18,500 కు పెంచుతూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది.
Also Read: మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి మాత్రం ఏం ఉపయోగం? ప్చ్.. కూటమి ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తోందా?
ఎన్నికల్లో హామీ మేరకు..
తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్( out sourcing) కార్మికులకు వేతనాలు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమందిగా ఉన్న ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు ఈ నిర్ణయంతో మేలు జరగనుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాక పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కు అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం మున్సిపాలిటీలు, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి కార్మికుల వేతనాల్లో మార్పులు రానున్నాయి.
Also Read: మద్యం కుంభకోణంలో వైయస్ భారతి పేరు?
దశాబ్దాలుగా పనిచేస్తున్నా..
రాష్ట్రవ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో( municipality ) ఔట్సోర్సింగ్ కార్మికులు దశాబ్దాలుగా పనిచేస్తూ వచ్చారు. వారి జీతాలు అంతంత మాత్రమే. అయితే భవిష్యత్తులో తమ జీవితాలు పెరుగుతాయని భావిస్తూ వచ్చారు. కానీ దశాబ్ద కాలంగా వారి జీవితాల్లో ఎటువంటి వ్యత్యాసం కనిపించలేదు. 2018లో పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ గత ఐదేళ్లుగా వారు వెయిట్ చేశారు. కానీ వైసిపి ప్రభుత్వం ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వేలాదిమంది మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. అయితే మిగతా శాఖల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సైతం జీతాల పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రాధాన్యత క్రమంలో వచ్చే నాలుగేళ్లలో మిగతా ఉద్యోగులపై సైతం ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..