Google Pay: మనీ ట్రాన్స్ ఫర్, బిల్లుల చెల్లింపులన్నీ ఇప్పుడు డిజిటల్ మాధ్యమాల ద్వారానే సాగుతున్నాయి. చేతిలో మొబైల్ ఉంటే చాలు ఎక్కడి నుంచైనా.. ఎవరికైనా చెల్లింపులు చేయడం సులభతరం అయింది. వినియోగదారులను ఆకర్షించేందుకు డిజిటల్ మాధ్యమాలైన గూగుల్ పే, ఫోన్ పే , పేటీఎం వంటివి అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా చెల్లింపులు సులభతరం కావడంతో చాలా మంది వీటిని డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో ఇవి టాప్ రేంజ్ లో ఉన్నాయి. అయితే డిజిటల్ చెల్లింపుల్లో ముందుగా వచ్చినా గూగుల్ పే కంటే ఆ తరువాత అందుబాటులోకి వచ్చిన ఫోన్ పే ను ఎక్కువ వాడుతున్నారు? ఎందుకంటే?
అమెరికాలో ప్రారంభమైన గూగుల్ పే ను ఆ తరువాత స్విట్జర్లాండ్, భారత్ లోనే ఎక్కువగా వినియోగించారు. గూగుల్ పే యూజర్స్ ను ఎప్పటికప్పుడు ఆ సంస్థ గణాంకాలు నిర్వహించకున్నా.. 2022 నుంచి 2026 వరకు అమెరికాలో 6 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఆ తరువాత ఇతర దేశాల్లో విస్తరించుకుపోయిన ఈ యాప్ ను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ల మంది వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అమెరికాలోనే 25.2 మిలియన్ల యూజర్స్ ఉన్నట్లు సమాచారం.
డిజిటల్ చెల్లింపుల్లో భాగమైన ఫోన్ పే ఆలస్యంగా అందుబాటులోకి వచ్చినా.. అత్యధిక కస్టమర్లను కలిగి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. 2023 నవంబర్ ప్రకారం ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఫోన్ పే వాడుతున్నారు. మొదట్లో వంద కోట్ల మంది భారతీయల్లో 50 శాతం మాత్రమే సాధించామని ఫోన్ పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. కానీ ఆ తరువాత 99 శాతం పిన్ కోడ్ లు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల యూజర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది కాలంగా గూగుల్ పే కంటే ఫోన్ పే కు ఎక్కువ ఆదరణ లభిస్తోందని తెలుస్తోంది. అంతేకాకుండా ఫోన్ పే సులభంగా మనీ ట్రాన్స్ ఫర్ తో పాటు చెల్లింపుల్లో సులభతరం చేసింది.అయితే గూగుల్ పే నెంబర్ వన్ స్థానం కోసం కొన్ని మార్పులు చేస్తోంది. ఇటీవల విదేశాల్లో కూడా గూగుల్ పే సేవలను ప్రారంభించింది. దీంతో వినియోగదారులు ఆదరిస్తారని దాని మాతృసంస్థ బెటా ప్రతినిధులు పేర్కొంటున్నారు.