Budget Cars: తక్కువ బడ్జెట్ లో వచ్చే అప్డేట్ చేసిన కార్లు ఇవే..

దేశీయ కార్ల ఉత్పత్తిలో అనేక కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి. వీటిలో మారుతి సుజుకీ ముందంజలో ఉంటుంది. ఈ కంపెనీ ఇప్పటికే తెచ్చిన గ్రాండ్ విటారాను అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త గ్రాండ్ విటారాలో హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ తో అల్ఫా, అల్ఫా ప్లస్, డెల్టా, జీటా వేరియంట్ లో లభిస్తుంది.

Written By: Chai Muchhata, Updated On : January 21, 2024 5:42 pm

Budget Cars

Follow us on

Budget Cars: కార్లు కొనేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో కొత్త కారు కావాలనుకునేవారు తక్కువ బడ్జెట్ తో పాటు మంచి మైలేజ్ ఇచ్చే వాటి కోసం చూస్తున్నారు. దీంతో కొన్ని కంపెనీలు వినియోగారులను ఆకర్షించేలా తక్కువ ధరలో కార్లను విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు. మారుతి సుజుకీ నుంచి కియా కంపెనీల వరకు తమ పాత మోడళ్లను ఆధునీకరించాయి. 2024 కొత్త ఏడాది సందర్బంగా వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఈ కార్లను ఒకదానితో ఒకటి పోలిస్తే ధరల్లో తేడాలున్నాయి. అన్నింటికంటే తక్కువ ధరకు వచ్చే కారు ఏదో తెలుసుకోవాలని ఉందా?

దేశీయ కార్ల ఉత్పత్తిలో అనేక కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి. వీటిలో మారుతి సుజుకీ ముందంజలో ఉంటుంది. ఈ కంపెనీ ఇప్పటికే తెచ్చిన గ్రాండ్ విటారాను అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త గ్రాండ్ విటారాలో హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ తో అల్ఫా, అల్ఫా ప్లస్, డెల్టా, జీటా వేరియంట్ లో లభిస్తుంది. దీనిని రూ.10.70 లక్షల ఎక్స్ షోరూంతో విక్రయిస్తున్నారు. టాప్ వేరియంట్ రూ.19.9 లక్షలతో అమ్ముతున్నారు. కియా కంపెనీ నుంచి రిలీజ్ అయిన సెల్టోస్ గురించి తెలిసిన విషయమే. ఇది మూడు ట్రిమ్ లు అనగా టెక్ లైన్, జీటీ లైన్, ఎక్స్ లైన్ అనే వేరియంట్ లో లభిస్తుంది. దీనిని రూ.10.90 లక్షల ప్రారంభ ధరతో అమ్ముతున్నారు.

టయోటా కార్ల కంపెనీ వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తోంది. ఈ కంపెనీకి చెందిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఈ, ఎస్, జీ, బీ తో పాటు మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది. దీనిని రూ.10.73 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ వేరియంట్ రూ.19.74 లక్షలు ఉంది. కొరియా కంపెనీకి చెందిన హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిప్ట్ ను అప్డేట్ చేసి రిలీజ్ చేసింది. దీని ధర రూ.10.99 లక్షలుగా ఉంది. స్కోడా కుషాక్ రూ.11.89 లక్షలతో విక్రయిస్తున్నారు.