Homeబిజినెస్iPhone : 2027లో రాబోయే యాపిల్ ఫోన్లు.. టెక్నాలజీ ప్రపంచాన్ని షేక్ చేస్తాయా?

iPhone : 2027లో రాబోయే యాపిల్ ఫోన్లు.. టెక్నాలజీ ప్రపంచాన్ని షేక్ చేస్తాయా?

iPhone : యాపిల్ కంపెనీ ఎప్పుడూ కొత్త కొత్త టెక్నాలజీతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టేందుకు రెడీ అవుతుంది. 2027 నాటికి యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను, అలాగే పూర్తిగా గ్లాస్ బాడీతో ఉండే మరో ఫోన్‌ను లాంచ్ చేయొచ్చని అంటున్నారు. ఇవి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒక పెద్ద గేమ్ ఛేంజర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు మోడళ్లు కొత్త టెక్నాలజీని పరిచయం చేయడమే కాకుండా, ఆండ్రాయిడ్ ఫోన్ తయారు చేసే కంపెనీలకు కూడా ఒక పెద్ద సవాలుగా మారొచ్చు.

Also Read : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ట్రూకాలర్‌కు పోటీగా ఆపిల్ కొత్త యాప్!

ఇప్పటికే మార్కెట్‌లో శామ్‌సంగ్, మోటరోలా వంటి బ్రాండ్ల ఫోల్డబుల్ ఫోన్లు వచ్చాయి. కానీ వాటిల్లో ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ మధ్యలో ఒక చిన్న గీత (క్రీజ్) కనిపిస్తుంది. అయితే, రిపోర్ట్స్ ప్రకారం, యాపిల్ వాళ్ల ఫోల్డబుల్ ఐఫోన్‌లో ఈ సమస్య ఉండదని చెప్తోంది. దాని స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుందట. అంటే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌లో ఆ గీత దాదాపు కనిపించదన్నమాట. ఈ ఫోన్‌లో పెద్ద స్క్రీన్‌తో పాటు యాపిల్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ అయిన iOS ప్రత్యేక ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ ఫోన్‌ను ఐఫోన్ ప్రపంచంలో ఒక కొత్త శకానికి నాందిగా యాపిల్ భావిస్తోంది.

గ్లాస్ బాడీ, కర్వ్డ్ డిజైన్‌తో ఐఫోన్ రాబోతోందా?
ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు యాపిల్ భవిష్యత్తులో పూర్తిగా గ్లాస్‌తో చేసిన ఐఫోన్‌ను కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఇది కర్వ్డ్ బాడీతో, సరికొత్త లుక్‌లో ఉంటుందట. దీన్ని ఒక రకంగా ఫ్యూచర్ ఐఫోన్ అని కూడా చెప్పొచ్చు. దీని డిజైన్ ట్రాన్స్‌పరెంట్‌గా, స్మూత్‌గా, చాలా ప్రీమియంగా ఉంటుందట. 2017లో ఐఫోన్ X ఫేస్ ఐడీ, బెజెల్-లెస్ డిజైన్‌తో టెక్నాలజీని ఎలా మార్చిందో, అలాగే 2027లో రాబోయే ఈ రెండు కొత్త మోడళ్లు ఐఫోన్ గుర్తింపును మళ్లీ కొత్తగా మారుస్తాయని యాపిల్ భావిస్తోంది.

Also Read : యాపిల్‌ కేరాఫ్‌ ఇండియా.. ఇక అన్ని ఫోన్లు ఇక్కడే!

ఇక ఆండ్రాయిడ్ కంపెనీలు క్లోజ్ చేసుకోవాల్సిందేనా?
యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ ఆండ్రాయిడ్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయం. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ కంపెనీలే ఫోల్డబుల్ టెక్నాలజీలో తమను తాము నిరూపించుకున్నాయి. ఇప్పుడు యాపిల్ వాటికి మంచి డిజైన్‌తో, హై క్వాలిటీ డివైజ్‌తో పోటీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. యాపిల్ iOS సాఫ్ట్‌వేర్, దాని లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పుడూ దాన్ని ఇతర కంపెనీల కంటే ఒక అడుగు ముందే ఉంచుతుంది. ఒకవేళ యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో, మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌తో వస్తే, అది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో పెద్ద మార్పులు తీసుకురావచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version