Jio : జియో తన కస్టమర్లను ఫుల్ ఖుషీ చేసేందుకు ఏకంగా 90 రోజుల వ్యాలిడిటీతో ఒక సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో ఉన్న బెనిఫిట్స్ చూస్తే మీరు కూడా ఇప్పుడే రీఛార్జ్ చేసుకోవాలనిపిస్తుంది. 90 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్ ధర వెయ్యి రూపాయలు కూడా లేదు.. కేవలం రూ. 899 మాత్రమే. అంటే ఇది మూడు నెలలు పనిచేస్తుంది. ఈ ప్లాన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది లోకల్, ఎస్టీడీ అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ ప్లాన్ తీసుకుంటే ఎంత లాభం ఉంటుందో, అలాగే ఫ్రీగా ఓటీటీ, ఫ్రీ డేటా ఎలా పొందొచ్చో కూడా తెలుసుకోండి.
Also Read : తక్కువ ధరలో ఎక్కువ లాభాలు.. జియో రూ. 189 ప్లాన్ వివరాలివే
ఎక్స్‌ట్రా 20GB డేటాతో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ
జియో ఈ ప్లాన్‌లో మీకు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీగా ఇస్తుంది. ఇందులో రోజుకు 2GB డేటా వాడుకోవచ్చు. మొత్తం ప్లాన్‌లో 180GB డేటా వస్తుంది. రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీకు అదనంగా 20GB డేటా ఫ్రీగా ఇస్తారు. అంటే మీరు మొత్తం 200GB డేటా వాడుకోవచ్చు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఈ ప్లాన్‌లో జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తారు. ఇందులో మీరు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌లో 5G కనెక్టివిటీ ఎనేబుల్ కాకపోతే, సెట్టింగ్‌లోకి వెళ్లి చేసుకోవచ్చు.
స్టోరేజ్ టెన్షన్ ఇక ఉండదు
జియో ఈ ప్లాన్‌తో మీ స్టోరేజ్ టెన్షన్ కూడా తీరిపోతుంది. ఇందులో మీకు 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా ఇస్తారు. దీని వల్ల మీ ఫోన్ స్టోరేజ్ పెరుగుతుంది. మీరు ఎక్కువ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు మొదలైన వాటిని జియో క్లౌడ్ స్టోరేజ్‌లో భద్రంగా దాచుకోవచ్చు. ఒకవేళ మీ ఏరియాలో జియో నెట్‌వర్క్ సరిగ్గా రాకపోతే, మీరు జియో కస్టమర్ కేర్‌కు కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు. అంతేకాకుండా మీ ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి నెట్‌వర్క్ సెట్టింగ్‌లను కూడా మార్చుకోవచ్చు.
Also Read : మళ్లీ పెరగనున్న రిచార్జ్ లు.. ఎయిర్ టెల్, జీయోల నిర్ణయం..