iPhone 17 bookings closed: కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే కొందరికి ఎనలేని సంతోషం. వీరి డిమాండ్ కు అనుగుణంగా ఆపిల్ కంపెనీ కొత్త కొత్త సిరీస్ ను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. ఐఫోన్ తాజా 17 సిరీస్ ఇటీవలే లాంచ్ అయింది. ఇది అమెరికా, భారత్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. సెప్టెంబర్ 19 నుంచి దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నారు. అయితే ఇంతకంటే ముందే ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 19 నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా చాలా మంది ఐఫోన్ 17 సిరీస్ కోసం బుకింగ్ చేసుకున్నారు. కానీ తాజాగ అందుతున్న సమాచారం ప్రకారం ఐఫోన్ 17 సిరీస్ బుకింగ్ ను నిలిపివేసింది. ఇందుకు కారణం ఏంటంటే?
ఆపిల్ కంపెనీ నుంచి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మార్కెట్లోకి రాకముందే డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభమైన తరువాత దీని కోసం ఎగబడినట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ప్రో మ్యాక్స్ నారింజ్ కలర్ ఫోన్ ను ఎక్కువగా బుక్ చేసుకున్నట్ల తెలుస్తోంది. దీంతో దీనిని పికప్ చేసుకునే సమయం రావడంతో ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రస్తుతం ఆర్డర్లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఆరెంజ్ కలర్ బాగా ఆకట్టుకోవడంతో చాలా మంది దీనిపైనే ఎక్కువగా ఆసక్తి చూపారు. ఈ ఫోన్ మొత్తం నాలుగు కలర్లలో అందుబాటులోకి వస్తోంది. అయితే నారింజ్ కలర్ కు ఎక్కువగా ఆకట్టుకోవడంతో దీని కోసం ఆసక్తి చూపారు.
ఇందులో రెండో ఆప్షన్ గా డీప్ బ్లూ కూడా ఉండడంతో ఇప్పుడు వీటి బుకింగ్ కోసం అవకాశం కల్పించారు. అయితే ఆ తరువాత నారింజ్ కలర్ లోని మొబైల్స్ అందుబాటులోకి వస్తాయా? లేదా? అనేది తెలియాలి. ప్రస్తుతం ఈ కలర్ మొబైల్ కావాలనుకునేవారికి మాత్రం చేదు వార్తే అని చెప్పవచ్చు. తాజాగా ఆపిల్ కంపెనీ నుంచి ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. ఐఫోన్ 17 సిరీస్ రూ.82,900గా ఉంది. ఆ తరువాత రేంజ్ ను భట్టి ధరలను నిర్ణయించారు.
ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికొస్తే.. 6.3 అంగుళాల డిస్ ప్లేతో సన్నని బెజెల్స్ ఉండి సిరామిక్ షీల్డ్ తో కలిగి ఉంటుంది. ఈ మొబైల్ A19 చిప్ తో పనిచేస్తుంది. ప్రతీ మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చూస్తారు. యూత్ కు అనుగుణంగా ఈ కొత్త ఫోన్ లో డ్యూయెల్ కెమెరాను అమర్చారు. ఇవి రెండు 48 మెగా ఫిక్సల్ తో పనిచేయనున్నాయి. ఈ కెమెరా 8x జూమ్ చేసుకోవచ్చు.