ప్రస్తుతం ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బు పొందడానికి ఎన్నో స్కీమ్స్ అమలవుతున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ హామీతో ఉన్న ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ప్రధానమంత్రి వయ వందన స్కీమ్ పేరుతో అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరడంతో పాటు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.4 శాతం వడ్డీ రేటు అమలవుతుండగా ఈ స్కీమ్ వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 2023 సంవత్సరం మార్చి నెల వరకు దేశంలో ఈ స్కీమ్ అమలు కానుంది. ఎల్‌ఐసీ కార్యాలయం ద్వారా, ఎల్‌ఐసీ వెబ్‌సైట్ ద్వారా, ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ లో సులభంగా చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. లక్షన్నర రూపాయల నుంచి 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఈ స్కీమ్ లో చేరవచ్చు.
ఈ స్కీమ్ కు డెత్ బెనిఫిట్ ఉండటంతో పాటు ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు 10 సంవత్సరాల పాటు పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో చనిపోతే నామినీ పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు నెలనెలా బ్యాంకు ఖాతాలో నగదు జమవుతుంది. కనీస పెన్షన్ నెలకు 1,000 రూపాయలు కాగా గరిష్ట పెన్షన్ నెలకు 10,000 రూపాయలుగా ఉంది.
పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత పాలసీపై లోన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాలసీ డబ్బులు ప్రతి నెలా వద్దని అనుకునేవారు ఎన్ని నెలలకు పెన్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారో అనే అంశాన్ని ముందుగానే పేర్కొనాలి. 10 సంవత్సరాలు పూర్తికాకముందే పాలసీ వద్దని అనుకుంటే ఇన్వెస్ట్ చేసిన డబ్బులో 98 శాతం మాత్రమే వెనక్కు వచ్చే అవకాశం ఉంటుంది.