సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటేరోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లను తాగాలని వైద్యులు సూచనలు చేస్తుంటారు. ఎవరైతే నీళ్లు తక్కువగా తాగుతారో వాళ్లను డీ హైడ్రేషన్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువగా నీళ్లు తాగేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారని తక్కువగా నీళ్లు తాగేవాళ్లు త్వరగా అలసటకు గురవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నీళ్లు తక్కువగా తాగేవాళ్లలో పాదాలలో విపరీతమైన నొప్పి కలగడంతో పాటు కాళ్లు లాగుతాయి. నీళ్లు తక్కువగా తాగేవాళ్లను కండరాలకు సంబంధించిన సమస్యలు వేధిస్తాయి. మన శరీరంలోని కండరాలలో 76 శాతం నీరు మాత్రమే ఉంటుంది. శరీరానికి సరైన స్థాయిలో నీళ్లు అందకపోతే ఆ వ్యక్తి రాత్రి సమయంలో మేలుకొని ఉంటాడు. నీళ్లు తక్కువగా తాగేవాళ్లలో మలబద్ధకం సమస్యలు కూడా వస్తాయి.
నీళ్లు తాగని వాళ్లను మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 4 లీటర్ల నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. కాలాలతో సంబంధం లేకుండా నీళ్లను ఎక్కువగా తీసుకోవడం ద్వారా అనేక సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.