ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా వేర్వేరు విభాగాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
38 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీలకు ఐదేళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, పీడబ్ల్యూడీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన తుది ఎంపిక జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన టీచింగ్ పోస్టులకు ఎంపికవుతారో వాళ్లు నెలకు 1,01,500 రూపాయల వేతనంతో పాటు ఇతర అలవెన్సులను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.iittp.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతగానో మేలు జరగనుందని చెప్పవచ్చు. తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.