Chennai: సాధారణంగా పండుగ పూట బోనస్ లభిస్తే ఉద్యోగులు ఎగిరి గంతేస్తారు. మరి ఊహించని గిఫ్టు లభిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. అటువంటి ఆనందంలో తేలియాడుతున్నారు చెన్నైలోని ఓ ఐటీ సంస్థలోని ఉద్యోగులు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా యజమాని ఖరీదైన కార్లు బహుమతిగా ఇవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఐడియాస్ 2 ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మురళి తన 50 మంది ఉద్యోగులకు వివిధ రకాల సరికొత్త కార్లను బహుమతిగా ఇచ్చారు. 2009లో భార్యతో కలిసి మురళి తన సంస్థను ప్రారంభించారు. వెంచర్ ను ప్రారంభించినప్పటి నుంచి కొంతమంది ఉద్యోగులు తనకు అండగా నిలబడ్డారు. అందుకే కృతజ్ఞతగా కార్లను బహుమతిగా ఇచ్చేందుకు మురళి సిద్ధపడ్డారు. అంతటితో ఆగకుండా కంపెనీలో 33% షేర్లను మొదటి నుంచి తనతో కలిసి పనిచేస్తున్న ఉద్యోగులకు రాసిచ్చారు.
కంపెనీకి లభిస్తున్న ఆదాయంలో ఉద్యోగుల కోసం కొంత మొత్తం పొదుపు చేస్తున్నారు. ఆ సొమ్ముతోనే ఉద్యోగులకు బహుమతులు అందజేస్తున్నట్లు అధినేత మురళి తెలిపారు. గత ఏడాది ఇదేవిధంగా 100 మంది ఉద్యోగులకు బహుమతిగా కార్లు అందించారు. ఈ ఏడాది మరో 50 మందికి అందించగలిగారు.ఇదో నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మురళి చెబుతున్నారు. కార్లు బహుమతులుగా లభించడంతో ఐటీ ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ideas 2 head of it technology services murali gifted cars to the employees
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com