ఆంధ్రప్రదేశ్‌AP Politics : వైసీపీ నుంచి టిడిపి, జనసేనలోకి అందుకే చేరికలు లేవా?

AP Politics : వైసీపీ నుంచి టిడిపి, జనసేనలోకి అందుకే చేరికలు లేవా?

AP Politics : ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. అధికారంలోకి రావాలని టిడిపి, జనసేన భావిస్తుండగా.. రెండవసారి కూడా అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష పార్టీలకు గట్టి సమాధానం ఇవ్వాలని అధికార వైసిపి భావిస్తోంది. అయితే అక్కడ టిడిపికి ఓవర్గం మీడియా అండగా ఉంది. అందుకే తిరువూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య భారీ గొడవ జరిగింది. ఇరు వర్గాలు కొట్టుకోవడంతో చాలామంది గాయపడ్డారు. అందులో ఒక పోలీస్ కూడా ఉన్నారు. యాదృచ్ఛికంగా ఈ వార్త టీడీపీ అనుకూ మీడియాలో పెద్దగా ప్రసారం కాలేదు. ప్రచురణకు కూడా నోచుకోలేదు. ఒకవేళ ఇదే ఘటన వైసీపీలో జరిగి ఉంటే ఆ మీడియా ఎలా చేసి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే కాదు ఆ వర్గం మీడియా ఎంత తాపత్రయపడినప్పటికీ జరగాల్సింది జరగడం లేదు. ఇంతకీ అదేంటంటే..

ఈసారి కూడా అధికారంలోకి రావాలని వైసిపి అధినేత జగన్ భావిస్తున్నారు. అందుకే దాదాపు 38 స్థానాలలో కొత్త వారికి లేదా ప్రస్తుతం ఉన్న వారిలోనే మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అలాంటప్పుడు సహజంగానే ఇతర పార్టీలోకి నాయకులు వలస వెళుతుంటారు. ఇదే జరుగుతుందని టిడిపి, జనసేన భావించాయి. కానీ ఆ రెండు పార్టీలు భావించినట్టు వైసిపి నుంచి భారీగా చేరికలు ఉండటం లేదు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు పక్కన పెడితే.. పెద్దపెద్ద తలకాయలు మాత్రం ఇంతవరకు అటు టిడిపిలో గాని ఇటు జనసేనలో గాని చేరిన దాఖలాలు లేవు. మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో.. ఆయన నేరుగా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని నిర్ణయించుకున్నారు. అంతేతప్ప అటు జనసేన వైపుగాని.. ఇటు టిడిపి వైపు గాని ఆయన చూడలేదు.. ఇంతమంది ఎమ్మెల్యేలను మార్చుతున్నప్పటికీ వారు ఎందుకు ఇతర పార్టీలవైపు చూడడం లేదంటే..

ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ, జనసేన కలసి పోటీ చేయబోతున్నాయి. సో ఇప్పటికే చాలా వరకు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక అంగీకారం కుదిరింది. అయితే ఇందులోకి వైసిపి నుంచి వచ్చే వారికి పెద్దగా ప్రాధాన్యం దక్కే అవకాశం లేదు. అలాంటప్పుడు వైసీపీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. సరిగ్గా దీన్ని గుర్తించే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్పునకు గురైన వైసిపి నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం లేదు. అందుకే జగన్ చాలా ధైర్యంగా మార్పుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇలా మార్పులు చేయకపోవడం వల్లే పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోయాడు. అందుగురించే తను ఓడిపోవద్దనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మార్పులకు శ్రీకారం చుట్టారు. సీటు తగ్గకపోయినప్పటికీ చాలామంది వైసిపి నాయకులు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్తున్నారంటే జగన్ స్కెచ్ ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. కానీ ఇదే విషయాలను రాయలేక.. అటు టిడిపిలోకి ఆశించిన స్థాయిలో వలసలు లేక.. ఆ వర్గం మీడియా పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. మరి వచ్చే రోజుల్లో ఆ వర్గం మీడియా ఎలాంటి వక్రీకరణలకు దిగుతుందో వేచి చూడాల్సి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Tammineni Sitaram

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...