Hyundai: ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన సన్‌రూఫ్, ఇప్పుడు సాధారణ కస్టమర్లకూ కూడా ఫస్ట్ ఆప్షన్ గా మారింది. సన్‌రూఫ్ అంటే కేవలం పైకప్పులో తెరుచుకునే అద్దం మాత్రమే కాదు. ఇది నేటి యూత్ కస్టమర్లకు ఓ స్టైల్ స్టేట్ మెంట్ గా మారింది. ఫ్యామిలీలు అయినా, కపుల్స్ అయినా, రోడ్ ట్రిపులకు వెళ్లే ఫ్రెండ్స్ అయినా, ఆఫీసుకు వెళ్లే ప్రొఫెషనల్స్ అయినా.. అందరూ లోపల ప్రీమియం ఫీలింగ్ ఇచ్చే, బయట నుండి ఎలిగెంట్‌గా కనిపించే కారును కోరుకుంటున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు హ్యుందాయ్ తయారుచేస్తున్న ప్రతి రెండో కారులో సన్‌రూఫ్ ఉంటుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా గత ఐదేళ్లలో భారతదేశంలో 11 లక్షలకు పైగా సన్‌రూఫ్ కార్లను విక్రయించింది. ఈ సంఖ్య కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, భారతీయ కస్టమర్లు ఇప్పుడు కారు కొనేటప్పుడు ప్రీమియం ఫీచర్లను ఎంతగా కోరుకుంటున్నారో ఇది స్పష్టం చేస్తుంది.
Also Read: అత్యంత దయనీయమైన పరిస్థితి లో రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. స్పందించిన జాకీ భగ్నానీ!
హ్యుందాయ్ ఇండియా ఇటీవలే తమ అనేక మోడల్స్‌లోని తక్కువ ధర వేరియంట్‌లలో కూడా సన్‌రూఫ్‌ను అందించడం ప్రారంభించింది. దీనితో ఈ ఫీచర్ ఇప్పుడు మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చింది. కంపెనీకి చెందిన ప్రస్తుత 14 కార్లలో 12 కార్లలో సన్‌రూఫ్ ఆప్షన్ ఉంది. ఇది హ్యుందాయ్ డెమోక్రటైజ్ టెక్నాలజీ అనే వ్యూహంలో భాగం. అంటే, హై-ఎండ్ ఫీచర్లు ఇకపై ఖరీదైన కార్లకే పరిమితం కావు.
హ్యుందాయ్ క్రెటాలో సన్‌రూఫ్ ఒక ప్రత్యేక ఫీచర్. ఇది కొన్ని వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ధర రూ.11.11 లక్షల నుండి ప్రారంభమై, టాప్ మోడల్ ధర రూ.20.50 లక్షల వరకు ఉంటుంది. క్రెటాలోని S (ఆప్షనల్), SX (O) వంటి వేరియంట్‌లలో సన్‌రూఫ్ అందుబాటులో ఉంది.
కంపెనీ ప్లాన్ ఏమిటి?
హ్యుందాయ్ ప్రకారం.. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కంపెనీ మొత్తం దేశీయ అమ్మకాలలో 54% కార్లు సన్‌రూఫ్ ఉన్నవే. అంటే, ప్రస్తుతం భారత రోడ్లపై నడుస్తున్న ప్రతి రెండో కారులో సన్‌రూఫ్ కనిపించవచ్చు. హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ ప్రకారం.. ఈ మైలురాయి భారతీయ కస్టమర్లు తమ దైనందిన జీవితంలో ప్రీమియం ఎక్స్ పీరియన్స్ కోరుకుంటున్నారని చూపిస్తుంది.