NTR Ghost: ప్రతీ హీరో కెరీర్ లో కొన్ని కళాఖండాలు ఉంటాయి. అవి ఎలాంటివి అంటే కాసేపు సరదాగా టైం పాస్ చేయడానికి అభిమానులు కూడా చూసుకెళనంత దారుణమైన సినిమాలు అన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ చిత్రం నుండి వరుసగా మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు కానీ,అప్పట్లో ఆయన చేసిన సినిమాలు కొన్ని అభిమానులను సైతం నవ్వుకునేలా చేశాయి. వాటిల్లో ముందుగా మనం ‘నాగ’ చిత్రం గురించి మాట్లాడుకోవాలి. ‘ఆది’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) చేసిన ‘అల్లరి రాముడు’ చిత్రం యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత ‘నాగ’ చిత్రం విడుదలైంది. సంక్రాంతి కానుకగా రావడంతో ఈ చిత్రానికి ఓపెనింగ్ వసూళ్లు భారీగా వచ్చాయి. కానీ లాంగ్ రన్ లో దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అయితే సోషల్ మీడియా లో ఈ సినిమాకు సంబంధించి ఒక సన్నివేశాన్ని అప్లోడ్ చేశారు నెటిజెన్స్.
Also Read: అత్యంత దయనీయమైన పరిస్థితి లో రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. స్పందించిన జాకీ భగ్నానీ!
ఈ సన్నివేశం లో ఎన్టీఆర్ శరీరం మొత్తం సున్నం పూసుకొని, రక్తం తో కనిపిస్తాడు. వెనుక పోలీసులు తరుముకుంటూ ఉంటే ఎన్టీఆర్ పరిగెడుతూ ఉంటాడు. అనంతరం ఒక గదిలో దెయ్యం లాగా గోడ పైన వేలాడుతూ ఉంటాడు. ఎన్టీఆర్ ని అలా చూసిన పోలీసులు బిత్తరపోతారు. అనంతరం ఎన్టీఆర్ వాళ్లందరితో ఫైట్ చేసి హీరోయిన్ ని కలవడానికి వెళ్తాడు. పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని, అలా చివరికి హీరోయిన్ వద్ద తలదాచుకుంటాడు. ఈ సన్నివేశం అయిన వెంటనే హీరో హీరోయిన్ మధ్య ఒక పాట వస్తుంది. దీనిని సోషల్ మీడియా లో ఒక నెటిజెన్ అప్లోడ్ చేయగా, అది తెగ వైరల్ గా మారింది. ప్రతీ ఒక్కరు ఈ సన్నివేశాన్ని చూసి పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకుంటున్నారు. ఎన్టీఆర్ ఇలాంటి సినిమాలు చేసేవాడా అని ఇప్పటి తరం ప్రేక్షకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఈ చిత్రానికి నిర్మాత మరెవరో కాదు, ‘హరి హర వీరమల్లు’ ని తెరకెక్కించిన AM రత్నం ఈ సినిమాకు నిర్మాత. డీకే సురేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఒకే ఒక్కడు, భారతీయుడు , ఖుషి లాంటి ఆల్ టైం క్లాసిక్ చిత్రాలను నిర్మించిన AM రత్నం నుండి ఇలాంటి చిత్రం రావడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్ రావడానికి AM రత్నం బ్రాండ్ కూడా అప్పట్లో ఉపయోగపడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘ఖుషి’ చిత్రం లోని ‘మేఘం తడిసెను..మెరుపు మెరిసెను’ సాంగ్ ని ఇందులో రీమిక్స్ చేసారు. అప్పట్లో ఈ పాట తెలుగు లో కూడా హిట్ అయ్యింది. సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతున్న ఈ వీడియో ని చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపం లో తెలియజేయండి.
Ganta sepu navvukonna
Em movie Ra Edi pic.twitter.com/ajwsq4MvmQ
— _ (@Durgesh_Rebel) July 5, 2025