Hyundai : హ్యుందాయ్ తన కొత్త ప్లియోస్ కనెక్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను విడుదల చేసింది. ఇది వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన ప్లియోస్ కనెక్ట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కూడిన డిజిటల్ అసిస్టెంట్ ఉంటుంది. ప్లియోస్ కనెక్ట్ గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది టెస్లా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పోలి ఉంది. ప్లియోస్ కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను 2026 రెండవ త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. 2030 చివరి నాటికి దీనిని రెండు కోట్ల కంటే ఎక్కువ కార్లలో అందించనున్నారు.
Also Read : థాయ్‌లాండ్‌లో దుమ్ములేపుతున్న ఇండియన్స్ ఫేవరేట్ కారు
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ప్లియోస్ కనెక్ట్ ఎక్కువ చిత్రాలను చూపించలేదు. అయితే, సమాచారం మేరకు ఇది టెస్లా కార్లలో కనిపించే డిస్‌ప్లేను పోలి ఉండే పెద్ద ఫ్రీస్టాండింగ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా టెస్లా స్క్రీన్ వలె ప్లియోస్‌లో కూడా ఎడమ మూలలో గేర్, బ్యాటరీ డిస్‌ప్లే ఉన్నాయి. దిగువన ఉన్న బటన్లు కూడా టెస్లా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ డిజైన్ నుంచి కాపీ చేసినట్లు అనిపిస్తుంది. మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ లాంటి ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది.
ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ డిజైన్
డిజైన్ విషయంలో హ్యుందాయ్ ప్లియోస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ దాదాపు టెస్లా సిస్టమ్‌ను పోలి ఉంటుంది. ఈ సిస్టమ్‌లో గ్లియో AI ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది వాయిస్ రికగ్నిషన్ ఆధారిత ఇంటెలిజెంట్ వెహికల్ కంట్రోల్‌ను అందిస్తుంది. గ్లియో AIతో పాటు హ్యుందాయ్ ప్లియోస్ ID గురించి కూడా ప్రస్తావించింది. ఇది ప్రతి డ్రైవర్‌కు సంబంధించిన ఒక ప్రొఫైల్. క్లౌడ్ కనెక్టివిటీ సహాయంతో హ్యుందాయ్ వాహన యజమానులు తమ యూజర్ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయగలరు. అలాగే వారు ప్లియోస్ కనెక్ట్‌తో కూడిన ఏ కారులోనైనా తమ సెట్టింగ్‌లను చేసుకోవచ్చు.
ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో సౌకర్యాలు
ప్లియోస్ ఒక ఎండ్-టు-ఎండ్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌గా వస్తుందని, ఇది హై పెర్ఫార్మెన్స్ చిప్స్, కంట్రోలర్‌లు, వెహికల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్, మొబిలిటీ, లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్ సొల్యూషన్ కోసం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ కలయిక స్మార్ట్ మొబిలిటీ ఫంక్షన్‌ల శ్రేణితో వస్తుందని ఆటోమేకర్ తెలిపింది. ఇందులో ఆటో డ్రైవింగ్, వెహికల్ కనెక్టివిటీ, రియల్ టైమ్ డేటా అనాలిసిస్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి.
Also Read : మరో మూడ్రోజులే.. హ్యుందాయ్ కార్ల మీద రూ.1.38లక్షలు ఆదా చేసుకోవచ్చు