Pawan Kalyan
Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని ఏర్పాటు చేసుకోవడానికి చాలా వరకు తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తూ వస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి సినిమాలతో ఆయన యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన మరోసారి తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన సెట్స్ మీద మూడు సినిమాలను ఉంచాడు. మరి ఈ మూడు సినిమాలు తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్నాయి అంటూ తమ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకైతే ఒక సినిమాను కూడా రిలీజ్ చేసే సరైన రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల డేట్స్ అనేవి సరిగ్గా దొరకడం లేదు. దాని వల్ల ఆయన సినిమాలను ఫినిష్ చేయలేకపోతున్నారు.
Also Read : పవన్ దూకుడు.. పిఠాపురంపై అనూహ్య నిర్ణయాలు!
ఇక ఇదిలా ఉంటే ఒక స్టార్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా మొదట ఆయనతో సినిమా చేస్తాను అని కమిట్ అయినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ వేరే సినిమాలకు కమిట్ అవ్వకుండా సెట్స్ మీద మూడు సినిమాలు చేసి ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు కమిట్ అవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
అందుకోసమే ఆయన ఆ దర్శకుడికి నో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే సురేందర్ రెడ్డి…మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న సురేందర్ రెడ్డి(Surendar Reddy) ఏజెంట్(Agent) సినిమా భారీ డిజాస్టర్ అవడంతో తను ఎవరితో సినిమా చేయాలి అనే ఒక డైలామాలో పడ్డాడు…
లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు మాట ఇచ్చినప్పటికి ప్రస్తుతం ఆయన ఉన్న సిచువేషన్ ను బట్టి చూస్తే ఆయన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాబట్టి సురేందర్ రెడ్డి ఇప్పుడు మరొక హీరోతో సినిమా చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది. మరి ఇంతకీ ఆయన ఏ హీరోతో సినిమా చేస్తాడు. ఆ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : మెగా ఫ్యామిలీ లో తీవ్ర విషాదం..శోకసంద్రంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్!