Hyundai Car
Hyundai : భారతదేశంలో కార్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్ 2025 నుంచి పలు కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచడానికి రెడీ అవుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కూడా ఉంది. మారుతి సుజుకి ఇండియా తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీదారుగా హ్యుందాయ్ కొనసాగుతోంది. ఇప్పటికే మారుతి సుజుకి కూడా ఏప్రిల్ నుండి తమ కార్ల ధరలను 4శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ కూడా తమ కార్ల ధరలను 3శాతం వరకు పెంచనుంది. ఈ ధరల పెరుగుదల వినియోగదారుల జేబు మీద ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. కంపెనీ 3శాతం ధర పెంచితే కొన్ని మోడళ్లను కొనడానికి రూ.1.38 లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి రావచ్చు.
Also Read : త్వరలోనే ప్రభుత్వ ట్యాక్సీలు.. ఓలా, ఉబర్, ర్యాపిడో మూసుకోవాల్సిందే
* గ్రాండ్ ఐ10 నియోస్: ప్రస్తుత ధర రూ.5.98 -8.62 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.6,15,940 – 8,87,860 వరకు ఉండవచ్చు.
* ఎక్స్‌టర్: ప్రస్తుత ధర రూ.6.00 – 10.51 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.6,18,000 – 10,82,530 వరకు ఉండవచ్చు.
* ఔరా: ప్రస్తుత ధర రూ.6.54 – 9.11 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.6,73,620 – 9,38,330 వరకు ఉండవచ్చు.
* ఐ20: ప్రస్తుత ధర రూ.7.04 – 11.25 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.7,25,120 – 11,58,750 వరకు ఉండవచ్చు.
* వెన్యూ: ప్రస్తుత ధర రూ. 7.94 – 13.62 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.8,17,820 – 14,02,860 వరకు ఉండవచ్చు.
* ఐ20 ఎన్ లైన్: ప్రస్తుత ధర రూ. 10.00 – 12.56 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.10,30,000 – 12,93,680 వరకు ఉండవచ్చు.
* వెర్నా: ప్రస్తుత ధర రూ. 11.07 – 17.55 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.11,40,210 – 18,07,650 వరకు ఉండవచ్చు.
* క్రెటా: ప్రస్తుత ధర రూ. 11.11 – 20.42 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.11,44,330 – 21,03,260 వరకు ఉండవచ్చు.
* వెన్యూ ఎన్ లైన్: ప్రస్తుత ధర రూ. 12.15 – 13.97 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.12,51,450 – 14,38,910 వరకు ఉండవచ్చు.
* అల్కాజార్: ప్రస్తుత ధర రూ. 14.99 – 21.70 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.15,43,970 – 22,35,100 వరకు ఉండవచ్చు.
* క్రెటా ఎన్ లైన్: ప్రస్తుత ధర రూ. 16.93 – 20.56 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.17,43,790 – 21,17,680 వరకు ఉండవచ్చు.
* క్రెటా ఈవీ: ప్రస్తుత ధర రూ. 17.99 – 23.50 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.18,52,970 – 24,20,500 వరకు ఉండవచ్చు.
* టక్సన్: ప్రస్తుత ధర రూ. 29.27 – 36.04 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.30,14,810 – 37,12,120 వరకు ఉండవచ్చు.
* అయోనిక్ 5: ప్రస్తుత ధర రూ. 46.05 లక్షలు. 3% పెరుగుదలతో కొత్త ధర రూ.47,43,150 వరకు ఉండవచ్చు.
ఈ ధరల పెరుగుదల వాహన తయారీ ఖర్చులు పెరగడం, ఇతర ఆర్థిక కారణాల వల్ల చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెల రానున్న నేపథ్యంలో కారు కొనాలనుకునే వినియోగదారులు ఈ ధరల పెరుగుదలను పరిశీలించుకోవచ్చు.
Also Read :