Maruti Swift vs Tata Tiago
Maruti Swift vs Tata Tiago : తక్కువ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే భారత మార్కెట్‌లో ఆనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మారుతి సుజుకి స్విఫ్ట్, టాటా టియాగో వంటి పాపులర్ కార్లు ఉన్నాయి. టాటా టియాగో, మారుతి స్విఫ్ట్ రెండూ వాటి స్టైలిష్ డిజైన్, ఫీచర్లు , పర్ఫామెన్స్ తో ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ రెండు కార్లలో దేనిని కొనాలో గందరగోళంలో ఉంటే రెండు కార్ల ఫీచర్లు, ధర, పనితీరు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. స్విఫ్ట్ 2024లో అప్‌డేట్ చేసింది మారుతి కంపెనీ. అయితే టాటా టియాగో కూడా ఇటీవల కొత్త అప్‌డేట్‌ను పొందింది. కాబట్టి ఏ కారు ఉత్తమమైనదో తెలుసుకోవడం ముఖ్యం. ఈ రెండు కార్ల డిజైన్, ఫీచర్లు, ఇంజన్, పనితీరు, ధరలను పోల్చి చూద్దాం.
Also Read : మారుతి స్విప్ట్.. సేప్టీ రేటింగ్ లో దీని ర్యాంక్ ఎంతంటే? ఇది నమ్మగలరా? అసలు విషయమేంటంటే?
రెండు కార్ల ఫీచర్లు, డిజైన్
మారుతి స్విఫ్ట్ కొత్త మోడల్ మునుపటి కంటే మరింత బోల్డ్, స్పోర్టీ లుక్‌తో వస్తుంది. ఇందులో క్రోమ్ గ్రిల్, LED DRLలు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని ఏరోడైనమిక్ డిజైన్ కారణంగా ఇది మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.
మరోవైపు, టాటా టియాగో డిజైన్ కొంచెం ప్రీమియం, కాంపాక్ట్‌గా కనిపిస్తుంది. ఇందులో సిగ్నేచర్ ట్రై-యారో గ్రిల్, LED DRLలు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, షార్ప్ కట్స్ చూడవచ్చు. దీని డిజైన్ యంగ్, అడ్వెంచరస్ డ్రైవర్లను ఆకర్షించవచ్చు.
రెండింటిలో ఏది మెరుగైనది?
స్పోర్టీ, ప్రీమియం లుక్ కావాలంటే మారుతి స్విఫ్ట్ మంచి ఎంపిక, అయితే టాటా టియాగో క్లాసిక్, కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారును ఇష్టపడితే మారుతి స్విఫ్ట్ మీకు మంచి ఆఫ్షన్. దీనితో పాటు మీరు తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లు , పవర్ ఫుల్ ఇంజన్‌ను కోరుకుంటే టాటా టియాగో బెస్ట్ ఆఫ్షన్ అనిపించవచ్చు. టియాగోలో 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్, మెరుగైన పవర్, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ లభిస్తాయి.
ధర విషయానికి వస్తే..
మారుతి స్విఫ్ట్ బేస్ వేరియంట్ రూ. 6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ రూ. 9.65 లక్షలకు అందుబాటులో ఉంది. CNG వేరియంట్ గురించి మాట్లాడితే ఇది రూ. 8.19 లక్షలకు లభిస్తుంది. టాటా టియాగో బేస్ వేరియంట్ ధర రూ. 4.99 లక్షలు. అయితే టాప్ మోడల్ రూ. 7.45 లక్షలకు అందుబాటులో ఉంది.
దీని CNG వేరియంట్ గురించి మాట్లాడితే దీనిని రూ. 5.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఎక్కువ మైలేజ్, అడ్వాన్స్డ్ ఫీచర్లు కావాలంటే మారుతి స్విఫ్ట్ బెస్ట్. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ, భద్రతకు ప్రాధాన్యత ఇస్తే టాటా టియాగో మంచి ఎంపిక కావచ్చు.
Also Read : మైలేజ్‌లో సూపర్.. సేఫ్టీలో బంపర్.. రూ.6 లక్షల్లో అద్భుతమైన కారు!