Mahindra 7 Seater Cars : శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పండుగల సీజన్ ప్రారంభమైంది. దీంతో మార్కెట్లో వస్తుసేవల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇప్పటినుంచి డిసెంబర్ వరకు మంచిరోజులు ఉంటాయి.ఈనేపథ్యంలో కొందరు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తుంటారు.ఇదే సమయంలో కొన్ని కంపెనీలు పండుగల సందర్భంగా ఆఫర్లు ప్రకటిస్తూఉంటాయి. ఆటోమోబైల్ రంగం విషయానికొస్తే పండుగల సీజన్లో కొన్నికార్ల కంపెనీలు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉంటాయి. తాజాగా మహీంద్రా కంపెనీ కొన్ని కార్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఇవి ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ పొందాయి. అయినా భారీగా తగ్గింపు ధరతో విక్రయిస్తుండడంతో కొనుగోలుదారులు ఆకర్షితులవుతున్నారు. ఇంతకీ మహీంద్ర కంపెనీ ఏ కార్లపై డిస్కౌంట్ ప్రకటింది? ఎంత వరకు తగ్గించింది?
ఆటోమోబైల్ రంగంలో మహీంద్ర కంపెనీ తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది. ఎస్ యూవీలను మార్కెట్లోకి తీసుకురావడంలో ఈ కంపెనీ ముందు ఉంటుంది. దీని నుంచి రిలీజ్ అయినా XUV 700 కారు ఆదరణ పొందింది. మూడేళ్ల కిందటే ఈ కార్లు మార్కెట్లోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా వెహికిల్స్ ను అమ్మారు. అయినా ఇప్పటికీ వీటి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. మహీంద్రా ఎక్స్ యూవీ 700 తో పాటు ఎక్స్ యూవీ 700 ఏఎక్స్ 5 డీజిల్ ఆటోమేటిక్ 7 సీటర్ కారు ధర కూడా తగ్గించింది.
మహీంద్రా XUV 700 చూడ్డానికి స్టైలిష్ గా ఉంటుంది. ఇందులో 2.2 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ , 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఇందులో 2 ఏడీఎస్, పనోరమిక్ సన్ రూప్, డ్యూయెల్ హెచ్ డీ సూపర్ స్క్రీన్ వంటి ఆఫర్లు ఉన్నాయి. లెథర్ సీట్ల వంటి హైఎండ్ ఫీచర్లు ఉన్నాయి. XUV 700 Ax5 డీజిల్ వేరియంట్ కారు 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.
మహీంద్రా XUV 700 ప్రస్తుతం మార్కెట్లో ధర రూ.13.99 నుంచి రూ.26.04 లక్షల వరకు విక్రయిస్తున్నారు. దీని టాప్ ఎండ్ వేరియంట్లపై రూ.2.2 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. అలాగే XUV 700 Ax5 మోడల్ రూ. 20.39 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తన్నారు. దీనిపై రూ. 50 వేలు తగ్గింపును ప్రకటించారు. ఇక XUV 700 Ax3 పై రూ.20 వేల తగ్గింపుతో విక్రయిస్తున్నారు. 2021 ఆగస్టులో రిలీజ్ అయిన ఈ XUV 700 ఇప్పటి వరకు 2 లక్షలు విక్రయించగా.. ఇందులో ఈ ఏడాదిలోనే 70 శాతం అమ్మకాలు సాధించింది. అయితే ఇప్పుడు తగ్గించిన ధరతో అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నాయి. ఎస్ యూవీ తో పాటు 7 సీటర్ కారుకు ఈ మధ్య డిమాండ్ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మహీంద్రా కార్లపై డిస్కౌంట్లు ప్రకటించడంతో వీటికి ఆదరణ పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎస్ యూవీ కోరుకునేవారికి ఈ కార్లు బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.