Pushpa 2 : ‘పుష్ప 2’ వాయిదా పడినందుకు నిర్మాతలు ఎన్ని కోట్లు వడ్డీ కట్టారో తెలుసా..? ఆ డబ్బులతో ఇంకో పుష్ప తీసేయొచ్చు!

'పుష్ప 2 సినిమాకి బడ్జెట్ 900 కోట్ల రూపాయిలు దాటేసిందట. సినిమా ఆగష్టు 15 నుండి వాయిదా పడినందుకు నిర్మాతలు 60 కోట్ల రూపాయిలు వడ్డీ కట్టుకోవాల్సి వచ్చిందట.

Written By: Vicky, Updated On : August 20, 2024 8:45 am

Pushpa 2

Follow us on

Pushpa 2 : మన టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి తర్వాత సినిమాలను బాగా ఆలస్యంగా తీసే అలవాటు ఉన్న మరో దర్శకుడు సుకుమార్. రాజమౌళి పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే సెట్స్ మీదకి ఒక సినిమాని పట్టాలెక్కిస్తాడు. కానీ సుకుమార్ కి అలాంటి అలవాటు లేదు. కేవలం సన్నివేశాలను మాత్రమే రాసుకుంటాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ ని అప్పటికప్పుడు అలోచించి రాస్తాడు. ఒకవేళ ఆయన తీసిన సన్నివేశం బాగా రాకపోతే మళ్ళీ రీ షూట్ చేయిస్తాడు. ఇలా పుష్ప 2 చిత్రానికి జరుగుతూనే ఉంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి బడ్జెట్ 900 కోట్ల రూపాయిలు దాటేసిందట. సినిమా ఆగష్టు 15 నుండి వాయిదా పడినందుకు నిర్మాతలు 60 కోట్ల రూపాయిలు వడ్డీ కట్టుకోవాల్సి వచ్చిందట.

ఇదంతా పక్కన పెడితే రీ షూట్స్ కారణంగా నిర్మాతలకు బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కి గర్భం వచ్చినట్టు చూపించడానికి 15 లక్షల రూపాయిలు ఖర్చు అయ్యిందట. ఇది వినేందుకు చాలా అతిగా అనిపిస్తుంది కదూ. అంతే కాదు డైరెక్టర్ సుకుమార్ కి ఏ సన్నివేశం కూడా నూటికి నూరు శాతం నచ్చడం లేదట. ఉదాహరణకి వైజాగ్ లో మాల్దీవ్స్ సెట్ వేయించి కొన్ని సన్నివేశాలు తీశారు. ఈ సెట్స్ కి బాగా ఖర్చు అయ్యింది. అయితే చివరి ఔట్పుట్ చూసిన తర్వాత సుకుమార్ సంతృప్తి చెందలేదు, ఇక్కడ కాదు నేరుగా మాల్దీవ్స్ కి వెళ్లి షూటింగ్ చేద్దాం అని అన్నాడట. నిర్మాతకి అక్కడ షూటింగ్ చేసేందుకు 100 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యినట్టు తెలుస్తుంది. టీజర్ లో చూపించిన జాతర ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందట. కాని సుకుమార్ కి ఫైనల్ ఔట్పుట్ అంతగా సంతృప్తి పర్చలేదు.

ఈ సన్నివేశాన్ని కూడా మరోసారి రీ షూట్ చేద్దాం అన్నాడట. ఇలా తీసిన సన్నివేశాలను మళ్ళీ మళ్ళీ తీస్తూ ఇప్పటి వరకు కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే చెయ్యడంతో అల్లు అర్జున్ కి సహనం నశించి, ఎవరికీ చెప్పకుండా గెడ్డం గీసేసుకొని విదేశాలకు వెళ్ళిపోయాడట. దీంతో నిర్మాతలు అల్లు అర్జున్, సుకుమార్ మధ్య చర్చలు జరిపి, సయోధ్య కుదిరించి మళ్ళీ అల్లు అర్జున్ ని షూటింగ్ లో పాల్గొనేలా చేసారు. ఇప్పుడు రెండు యూనిట్స్ తో షూటింగ్ నడుపుతున్నారు కానీ, డిసెంబర్ 6 వ తేదీన విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారట. అల్లు అర్జున్ లుక్ నుండి బయటకి వచ్చాడు కాబట్టి, ఇప్పటికిప్పుడు అదే తరహా లుక్ రావడం కష్టం కనుక విగ్ వాడుతున్నారట. మరోపక్క ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఫహాద్ ఫాజిల్ కి సంబంధించిన షూటింగ్ చాలా మిగిలి ఉందట. ఆయన డేట్స్ కోసం మూవీ యూనిట్ ఎదురు చూస్తుంది. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో కూడా అలాంటి ఐటెం సాంగ్ ని ప్లాన్ చేసాడట సుకుమార్. ఈ ఐటెం సాంగ్ కోసం ప్రస్తుతం హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు మేకర్స్.